బెల్లం, పంచదార రెండు తినడానికి తీపి పదార్థాలే అయిప్పటికీ వీటి గుణ గణాల్లో చాలా తేడా ఉంటుంది. చక్కర ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. బెల్లం అయితే ఎంత తిన్న ఏం కాదు. కానీ బెల్లం ప్రతి రోజు తినడం వల్ల రక్తహీనత సమస్య పోతుంది. ఇక మలబద్ధకం దరిచేరదు. రోజు భోజనం చేసిన తరువాత ఒక చిన్నబెల్లం ముక్క తింటే త్వరగా జీర్ణమవుతుంది. బెల్లం వల్ల ఎన్నో లాభాలున్నాయి. కానీ బెల్లం, పుట్నాలు కలిపి తినే అలవాటుంటుంది. చిన్నప్పుడు సరుకులు తీసుకున్నప్పుడు షాపు వాళ్లు ఫ్రీగా ఇచ్చే వాళ్లు ఇప్పుడు అన్నీ మాల్స్ వచ్చిన తరువాత అస్సలు ఎవ్వరూ ఇవ్వడం లేదు. బెల్లం పుట్నాలు కలిపి తినవచ్చా..? వాటి వల్ల ఉపయోగాలు ఉన్నాయా లేదా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రోటీన్లను అధికంగా కలిగిన ఆహార పదార్థాలలో పుట్నాల పప్పు ఒకటి. వీటిని తినడం ద్వారా మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి. పుట్నాల పప్పును ఉపయోగించి రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తారు. పుట్నాల పప్పుతో చేసే కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. పుట్నాల కారాన్ని మనం అన్నం, దోశ, ఉప్మా లాంటి వాటితో తింటుంటాం. పలు రకాల కూరగాయల వేపుడులను చేసేటప్పుడు వాటిలో పుట్నాలతో చేసిన కారాన్ని కానీ వేయడం మహిళలకు అలవాటు ఉంటుంది. పుట్నాల పప్పును శనగల నుంచి తయారు చేస్తారు. వీటిని తినడం ద్వారా గుండె ఆరోగ్యం బాగుంటుఏంది. జీర్ణాశయంలో సంబంధిత సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గడంలో పుట్నాలు బాగా ఉపయోగపడుతాయి. చర్మంపై ఉండే ముడతలను సామర్థ్యం పుట్నాల పప్పుకు ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి..!
ఈ రోజుల్లో చాలా మందికి కామన్ గా ఉండే సమస్య జుట్టు రాలడం, బెల్లం, పుట్నాలు కలిపి ప్రతీ రోజు తినడం వల్ల జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఆరోగ్యంగా అవుతుందట. ఇక పుట్నాల పప్పుతో మనం లడ్డులను కూడా తయారు చేసుకొని తినవచ్చు. ఇలా తయారు చేసుకుని తినడం వల్ల స్త్రీలలో నెలసరి సమస్యలు తగ్గుతాయని, గర్భిణులు పుట్నాల లడ్లులు తినడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బెల్లం మాత్రం నాణ్యమైనది తీసుకోవాలి. సాధారణ బెల్లం తయారు చేసేటప్పుడు పరిశుభ్రత పాటించరు. ఖరీదు అయినా పర్వాలేదు. కానీ మంచి బెల్లం తీసుకొని తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ఇది కూడా చదవండి : పూజ గదిలో ఈ పండు పెడితే పది రోజుల్లో అద్భుతాన్ని చూస్తారు.. ఏంటది..?