Home » పూజ గదిలో ఈ పండు పెడితే పది రోజుల్లో అద్భుతాన్ని చూస్తారు.. ఏంటది..?

పూజ గదిలో ఈ పండు పెడితే పది రోజుల్లో అద్భుతాన్ని చూస్తారు.. ఏంటది..?

by Sravanthi Pandrala Pandrala
Ad

చాలామందికి శ్రీలక్ష్మీ ఫలం గురించి తెలియదు. ఇది చూడటానికి అచ్చం కొబ్బరికాయలా ఉంటుంది. కాని దీని రంగు బూడిద రంగు. పెద్ద ఉసిరికాయ సైజులో ఉండే శ్రీలక్ష్మీ ఫలానికి కొబ్బరికాయకు ఉన్నట్టే పీచు ఉంటుంది. ఈ ఫలాన్ని సేకరించి ఇంట్లో పెట్టుకుంటే సాక్షాత్తు పాల సముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవిని మీ ఇంట్లో పెట్టుకున్నట్టే అని నమ్ముతారు. అమ్మవారు సాగరం నుంచి ఎలా ఉద్భవించిందో, ఈ ఫలాలు కూడా సాగర తీరాలలో దొరుకుతాయట. జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేని వారు, బాలారిష్ట దోషములు ఉన్నవారు ఈ ఫలాన్ని పెట్టుకుని పూజించాలి. దీన్నే రఘు నాలికేలం అని అంటారు. ఈ పండు దొరికితే ఇంట్లో దేవుడి దగ్గర పెట్టకూడదు. దానికి కూడా మంచి రోజు సమయం చూసుకొని, గురువారం, శుక్రవారం ఏదైనా పండగ దినం కానీ దేవుడి దగ్గర పెట్టి పూజించాలి.

Advertisement

also read;సలార్ మొత్తం ప్రభాస్ డూప్ తోనేనా..?

Advertisement

పూజకు ముందు ఈ ఫలాన్ని శుద్ధిచేసి దానికి కేటాయించిన పీఠంపై పసుపు రాసి, అలంకరించి దానిపై కొత్త వస్త్రం పరిచి శ్రీలక్ష్మీ ఫలాన్ని ఉంచాలి. ఈ ఫలాన్ని అక్కడ ఉంచి లక్ష్మీ అష్టకం, అష్టోత్తరం చదువుతూ పసుపు కుంకుమతో పూజించాలి. ఈ ఫలం పెట్టుకున్న ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి, సుఖశాంతులతో జీవిస్తారని పండితులు అంటున్నారు. శ్రీలక్ష్మీ ఫలాన్ని పూజించడంవల్ల ఉపయోగాలు ఏంటయ్యా అంటే దీనిని నిత్యం పూజించే వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏమీ ఉండవు. అనవసర ఖర్చులు తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు.

ఈ యొక్క ఫలాన్ని వ్యాపార స్థలాల్లో, ఆఫీసుల్లో ఉంచడం వల్ల అభివృద్ధి జరుగుతుందని నమ్ముతారు. అలాగే వ్యవసాయ పొలంలో ఉంచితే కూడా పంటలు సమృద్ధిగా పండుతాయట. ఈ శ్రీ లక్ష్మి పలాన్ని మన దగ్గర ఉంచుకోవడం వల్ల ఆ ఫలంతో పాటు ఎప్పుడూ నాణేలు కూడా ఉంచుకోవాలి. ఈ ఫలానికి ధూపదీపనైవేద్యాలు చూపించాక అదే వస్త్రంలో మూటకట్టి మనం ధనాన్ని ఎక్కడైతే భద్రపరుస్తామో అక్కడే ఉంచాలి.

also read;త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..?

Visitors Are Also Reading