Home » త‌మ‌న్ మార‌డా..? గాడ్ ఫాద‌ర్ టీజ‌ర్ మ్యూజిక్ ను అక్క‌డ నుండి లేపేశాడంటూ దారుణ‌మైన ట్రోల్స్..!

త‌మ‌న్ మార‌డా..? గాడ్ ఫాద‌ర్ టీజ‌ర్ మ్యూజిక్ ను అక్క‌డ నుండి లేపేశాడంటూ దారుణ‌మైన ట్రోల్స్..!

by AJAY
Ad

టాలీవుడ్ లోని టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ల‌లో త‌మ‌న్ ఒక‌రు. ప్ర‌స్తుతం త‌మ‌న్ ఫుల్ బిజీగా ఉన్నారు. వ‌రుస సినిమాలు చేస్తూ ఇండ‌స్ట్రీలో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. పాన్ ఇండియా సినిమాల‌కు సైతం త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. రీసెంట్ గా వ‌చ్చిన ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌కు త‌మ‌న్ మ్యూజిక్ అందించారు. అఖండ సినిమాలో ఇచ్చిన మ్యూజిక్ కు త‌మ‌న్ ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఇదిలా ఉండ‌గా చిరంజీవి ప్ర‌స్తుతం గాడ్ ఫాద‌ర్ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇవి కూడా చదవండి: జైలు జీవితాన్ని గడిపి వచ్చిన హీరో సుమన్ ని పిలిచి పిల్లనిచ్చిన జీవితాన్నే మార్చేసిన మనిషి ఎవరో తెలుసా ?

Advertisement

godfather-bgm

ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. రీసెంట్ గా ఈ సినిమా టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. కాగా టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాకు కూడా త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. అయితే రీసెంట్ గా విడుద‌లైన టీజ‌ర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓ సినిమా నుండి కాపీ కొట్టారంటూ సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

అది కూడా త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చిన సినిమానే కావ‌డం విశేషం. మెగా హీరో వ‌రుణ్ తేజ్ ఇటీవ‌ల గ‌ని సినిమాలో న‌టించారు. ఈ సినిమాకు కూడా త‌మ‌న్ మ్యూజిక్ అందించారు. అయితే ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ మ్యూజిక్ అచ్చం గాడ్ ఫాద‌ర్ సినిమా టీజ‌ర్ మ్యూజిక్ లా ఉందంటూ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

త‌మ‌న్ మ‌క్కికి మ‌క్కి మ్యూజిక్ ను దించేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కాపీ ట్యూన్ ట్రోల్స్ త‌మ‌న్ కు ఇదే మొద‌టిసారి కాదు. గ‌తంలో కూడా చాలా సార్లు త‌మ‌న్ ఇలాంటి ట్రోల్స్ ఎదుక్కొన్నారు. ట్రోల్స్ అనంత‌రం ఓ కార్య‌క్ర‌మంలో మ‌ళ్లీ ఇలా జ‌ర‌కుండా చూసుకుంటానంటూ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మ‌రోసారి మెగాస్టార్ సినిమాకు సైతం ట్యూన్ కాపీ కొట్టాడ‌ని త‌మ‌న్ ఇక మార‌డా అంటూ నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు.

ALSO READ : జైలు జీవితాన్ని గడిపి వచ్చిన హీరో సుమన్ ని పిలిచి పిల్లనిచ్చిన జీవితాన్నే మార్చేసిన మనిషి ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading