Home » అన్నం తిన్న తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. దరిద్రానికి స్వాగతం చెప్పినట్టే..!

అన్నం తిన్న తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. దరిద్రానికి స్వాగతం చెప్పినట్టే..!

by Azhar
Ad

మనదేశంలో పూర్వకాలం అన్నం తినడానికి ముందు… తిన్న తర్వాత చాలా రకాలైన ఆచారాలను పాటించేవారు. అలా చేయకపోతే మనకు దరిద్రం చుట్టుకుంటుంది అని నమ్మేవారు. కానీ ఇప్పుడు ఉన్న కాలంలో ఎలా దరిద్రం చుట్టుకుంటుంది… ఆధారాలు చూపించమని అడుగుతున్నారు. ఇలాంటి ప్రశ్నల వల్ల మనం చాలా ఆచారాలను పాటించడంలేదు. అయితే అన్నం విషయంలో ఎటువంటి ఆచారాలను పాటించారో ఇప్పుడు చూద్దాం.

Advertisement

చాలామంది అన్నం తిన్న వెంటనే ప్లేట్ లోనే చేతులు కడుగుతారు. కానీ అలా చేయకూడదు అలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. కాబట్టి తిన్న తర్వాత చేతులు పక్కకి వెళ్ళి కడగాలి. అలాగే ఎక్కువమంది తిన్న వెంటనే ప్లేట్ ముందు నుండి లేవరు. అలా కూర్చుని ప్లేట్ ను ఎండిపోనివ్వడం మంచిది కాదు. అలా చేస్తే కూడా దరిద్రం వస్తుంది. అందుకే ప్లేట్లో కనీసం కొన్ని నీళ్లు పోయాలి.

Advertisement

ఇక తిన్న తర్వాత ఎక్కువమంది పంటి మధ్యలో ఇరుక్కున్న ఆహారాన్ని పిన్నీసు, పుల్ల వంటివి ఉపయోగించి తీస్తూ ఉంటారు, కానీ అలా చేయకుండా… నోటిలో నీళ్ళు పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి, ఇలా చేయడమే మంచిది లేదంటే పళ్ళ మధ్యలో గ్యాప్ రావడం వంటివి జరుగుతుంది, ఇంకొంతమంది అయితే తిన్న వెంటనే ఏదో పెద్ద పని చేసినట్లు ఒళ్ళు విరుస్తారు, ఇలా అస్సలు చేయకూడదు. తిన్న వెంటనే ఒళ్ళు విరవడం, కూర్చోవడం, పండుకోవడం అనేది చాలా దరిద్రాన్ని తెస్తుంది. కాబట్టి ఇక నుండి మీరైనా ఇటువంటి తప్పులు చేయకుండా ఉండాలి

Visitors Are Also Reading