Home » ప్రైవేట్ వీడియోలు బ‌య‌ట‌పెడ‌తాన‌న‌డంతో.. ప్రియుడిని మ‌ట్టుపెట్టించిన ప్రియురాలు..!

ప్రైవేట్ వీడియోలు బ‌య‌ట‌పెడ‌తాన‌న‌డంతో.. ప్రియుడిని మ‌ట్టుపెట్టించిన ప్రియురాలు..!

by Anji
Ad

ఆమెకు వివాహం జ‌రిగింది. అయినా ప‌క్క‌దారి పట్టి ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌యం అయినా యువ‌కుడితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. భ‌ర్త‌కు తెలియ‌కుండా ర‌హ‌స్యంగా త‌న ప్రియుడితో క‌లిసి చెట్టాప‌ట్టాలెసుకుని తిరిగింది. ఆ వివాహేత‌ర సంబంధం చివ‌రికీ ప్రాణాల‌మీదికి దారి తీసింది . ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని మీర్‌పేట‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. మీర్‌పేట ప్ర‌శాంతిహిల్స్‌లో ఉండే శ్వేతారెడ్డికి బాగ్ అంబ‌ర్‌పేట‌లో ఉండే య‌శ్విన్ ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌యం అయ్యాడు. వీరిద్ద‌రి మ‌ధ్య చ‌నువు పెరిగి వివాహేత‌ర సంబంధం వ‌ర‌కు దారి తీసింది.

Advertisement

కొద్ది రోజుల నుంచి య‌శ్విన్ వేధింపుల‌కు దిగాడు. ఏకాంతంగా ఉన్న‌ప్పుడు తీసిన వీడియోలు, ఫోటోల‌తో బ్లాక్ మెయిల్ చేయ‌డం ప్రారంభించాడు. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని లేదంటే నీకు సంబంధించిన వీడియోలను, ఫోటోలు బ‌య‌ట‌పెడ‌తానంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డంతో స్నేహితుల‌తో క‌లిసి య‌శ్విన్‌ను చంపించింది. శ్వేతారెడ్డి య‌శ్విన్‌కు ఫోన్ చేసి తాను ఉంటున్న ఏరియాకి ర‌ప్పించిన శ్వేతారెడ్డి. స్నేహితులు కార్తిక్‌, అశోక్‌తో క‌లిసి చంపేసింది. ఆ త‌రువాత రోడ్డు ప్ర‌మాదంగా చిత్రీక‌రించింది. య‌శ్విన్ కుటుంబ స‌భ్యులు అనుమానం వ్య‌క్తం చేయ‌డంతో శ్వేతారెడ్డి గుట్ట బ‌య‌ట‌ప‌డింది. నిందితురాలు శ్వేతారెడ్డితో పాటు ఆమెకు స‌హ‌క‌రించిన ఆమె ఇద్ద‌రి స్నేహితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

శ్వేతారెడ్డికి స‌హ‌క‌రించిన అశోక్‌, కార్తీక్ కూడా ఫేస్‌బుక్ ఫ్రెండ్ అశోక్ ది ఏపీలోని కృష్ణాజిల్లా తిరువూరు య‌శ్విన్‌ను చంపించేందుకు మే 4న అశోక్ అండ్ కార్తీక్‌ను హైద‌రాబాద్ ర‌ప్పించిన శ్వేత‌, అదేరోజు రాత్రి చంపించేందుకు ప్ర‌ణాళిక వేశారు. ప‌క్కా ప్లాన్‌తో య‌శ్విన్‌ను పిలిచి, సుత్తితో కొట్టిపారిపోయారు. కొన ఊపిరితో రెండు రోజులు ఆసుప‌త్రిలో కొట్టుమిట్టాడిన య‌శ్విన్ మే 06న మ‌ర‌ణించాడు. ఇక సీసీటీవీ పుటేజ్ ఆధారంగా శ్వేతారెడ్డితో పాటు ఆమె స్నేహితులు అశోక్ అండ్ కార్తీక్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.

Also Read : 

మ‌హేష్ చెప్పిన డైలాగ్ బ‌న్నిపై సెటైర్‌.. సోష‌ల్ మీడియాలో హాట్ టాఫిక్..!

ఒకే ఏడాదిలో ఎక్కువ సినిమాలు విడుద‌లైన హీరోలు వీరే..!

Visitors Are Also Reading