వాస్తు శాస్త్రంలో ప్రతీ దిక్కుకు ఒక విశిష్టత ఖచ్చితంగా ఉంటుంది. వాస్తు శాస్త్రంలో దక్షిణ దిక్కులో వాస్తు దోషాలు ఉంటే చాలా భయానిక విషయాలు జరుగవచ్చు. మరణాలు కూడా సంభవించే ప్రమాదముంటుంది. దక్షిణ దిశ పట్ల ఎప్పుడూ జాగ్రత్త వహించాలని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవానికి దక్షిణ దిక్కులో వాస్తు నియమాలు పాటించితే మెరుగైన ఫలితాలుంటాయి. దక్షిణాన ఎక్కువగా చెడును సూచిస్తుంది. దక్షిణ దిక్కులో కొన్ని వస్తులను అసలు పెట్టకూదు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
దక్షిణ దిశలో చెప్పులను అసలు ఉంచకూడదు. ఈ దిశలో చెప్పులతో పాటు షూ కూడా ఉంటే మంచిది కాదు అని చెబుతున్నారు. అసలు చెప్పులు పెట్టుకునే స్టాండ్ ఎప్పుడూ దక్షిణ దిశలో ఉండకూడదు. దక్షిణ దిశలో చెప్పుల స్టాండ్ ఉంటే పెద్దలకు అవమానం జరిగినట్టే అవుతుంది. అలా చేయడం వల్ల ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఇంట్లో ప్రశాంతతకు భంగం కలుగుతుంది. ఎప్పుడూ దక్షిణ దిశ వైపు చెప్పులు పెట్టకూడదనే తప్పకుండా గుర్తుంచుకోవాలి.
అదేవిధంగా దక్షిణ దిశలో పొరపాటున కూడా తులసి మొక్కను పెట్టకూడదు. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా చెబుతారు. తులసి మొక్కను పవిత్రంగా భావిస్తారు. చాలా మంది నిత్యం పూజాధికారాలు చేస్తారు. తులసి మొక్కను ఎప్పుడూ పొరపాటున కూడా ఇంటికి దక్షిణ దిశలో పెట్టకూడదు. ఒకవేళ దక్షిణ దిశలో పెడితే ప్రతీకూల ఫలితాలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలా తులసి మొక్కను దక్షిణ దిశలో పెడితే లాభానికి బదులు నష్టం జరుగుతుంది.
ఇంట్లో చాలా పవిత్రమైన స్థలం పూజగది. ఎవరైనా సరే ఈశాన్య దిశలో పూజగదిని ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు వైపు తిరిగి భగవంతుడిని మనం పూజించుకునే విధంగా పూజగది ఉండాలి. అలాంటి పూజ గదిని చాలా మంది స్థల భావం కారణంగా దక్షిణ వైపునకు ఏర్పాటు చేసుకుంటారు. దక్షిణ వైపు మాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పొరపాటున కూడా పూజ గదిని దక్షిణం వైపునకు నిర్మించకూడదు. అలా చేస్తే సానుకూల ఫలితాలకు బదులు ప్రతీకూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో దరిద్రం వచ్చి పడుతుంది. అన్ని పనుల్లో కూడా నష్టం జరుగుతుంది. ఈ దిక్కులో పూజా గది ఏర్పాటు చేసి పూజలు చేసినా ఫలితం దక్కకపోవడం విశేషం.
Advertisement
ఇంట్లో అత్యంత ముఖ్యమైన గది పడక గది. మీ బెడ్ రూమ్ విషయంలో పడుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. పాదాలు ఎప్పుడూ దక్షిణం వైపునకు ఉండకుండా ఉండేవిధంగా జాగ్రత్త పడండి. అలా కాకుండా దక్షిణ వైపు పాదాలు ఉండే విధంగా పడకుంటే నిద్రలేమి సమస్య వస్తుంది. భార్యభర్తల మధ్య వైవాహిక జీవితం చెడిపోతుంది. బెడ్ రూమ్ జాగ్రత్త పడండి. దక్షిణం వైపు పాదాలు ఉండే విధంగా పడుకుంటే నిద్రలేమి సమస్య వస్తుంది. భార్య భర్తల మధ్య వైవాహిక జీవితం చెడిపోతుంది. బెడ్ రూమ్ విషయంలో దక్షిణం దిశను దృష్టిలో పెట్టుకుని తగిన విధంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read : సెల్ ఫోన్ పక్కలోనే వేసుకొని పడుకుంటున్నారా ? అయితే ఈ ప్రమాదం పొంచిఉన్నట్టే జాగ్రత్త..!
వంట గదిని ఇంటికి దక్షిణ దిశలో నిర్మాణం చేయకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో వంటి గది ఎంట్రెన్స్ దక్షిణ దిశలో ఉండేవిధంగా ఉండకూడదు. ఇది ఇంట్లో మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పేదరికానికి కూడా దారి తీస్తుంది. ఇంట్లో డబ్బు రావడం ఆగిపోయి ప్రతికూలత వ్యాపిస్తుంది. కాబట్టి వంటగది దక్షిణ దిశలో ఉండకుండా జాగ్రత్త పడాల్సిన అవసరముందని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. దక్షిణ దిశలో పెద్ద చెట్లు ఉండవచ్చని, దక్షిణ దిశకు ఉండే ప్రాధాన్యత మేరకు జాగ్రత్తలు పాటించడం వల్ల మంచి జరుగుతుందని పేర్కొంటున్నారు.