Home » సెల్ ఫోన్ పక్కలోనే వేసుకొని పడుకుంటున్నారా ? అయితే ఈ ప్రమాదం పొంచిఉన్నట్టే జాగ్రత్త..!

సెల్ ఫోన్ పక్కలోనే వేసుకొని పడుకుంటున్నారా ? అయితే ఈ ప్రమాదం పొంచిఉన్నట్టే జాగ్రత్త..!

by Anji
Ad

ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మొబైల్ ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. స్కూల్ కి వెళ్లే పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు అందరి స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఫోన్ మాట్లాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వచ్చిన తరువాత అందరికీ అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని చెప్పడంలో సందేహం లేదు. చాలా మంది నిద్ర పోయే సమయంలో సెల్ ఫోన్లు దిండు కింద పెట్టుకొని నిద్రపోతున్నారు. ఇలాంటి అలవాటు ఉన్నవారు ప్రమాదంలో పడినట్టే..

Advertisement

ముఖ్యంగా నిద్రపోయే సమయంలో సెల్ ఫోన్ దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోజు తలకింద సెల్ ఫోన్ పెట్టుకొని పడుకోవడం వల్ల దాని రేడియేషన్ కి క్యాన్సర్, ట్యూమర్స్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయంలో నిద్రించేటప్పుడు మెదడులో మెలటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతోంది. ఈ హార్మోన్ ఉత్పత్తి అవ్వడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది.

Advertisement

Also Read :  జ్ఞాపక శక్తి బాగా పెరగాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి..!

ఒకవేళ నిద్రపోయే సమయంలో ఫోన్ తలకింద పెట్టుకొని పడుకోవడం వల్ల సెల్ ఫోన్ రేడియేషన్ కి ఈ హార్మోన్ విడుదలవ్వదు. అందువల్ల నిద్రలేమి సమస్యలతో ఇబ్బందిపడతారు. సెల్ పోన్ తలకింద పెట్టుకొని పడుకోవడం ద్వారా దాని నుంచి వచ్చే రేడియేషన్ మన మెదడు మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. నిద్రలేమి సమస్యలు, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు నిద్రపోయే సమయంలో వారి దరిదాపుల్లో కూడా సెల్ ఫోన్ ఉండకుండా చూడాలి.

Also Read :   రక్తంలో చక్కెర తక్కువ అయితే ప్రాణానికే ప్రమాదం.. జాగ్రత్త ..!

 

Visitors Are Also Reading