Home » APRIL 3rd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

APRIL 3rd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

చైనా బ్రిట‌న్ ల‌లో క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. బ్రిట‌న్ లో 49ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. చైనాలో ఒక్క రోజే 13,146 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

రాజ‌స్థాన్ లోని క‌రౌలిలో మ‌త‌ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయి. బైక్ ర్యాలీ చేస్తున్న హిందూ యువ‌కుల‌పై రాళ్ల దాడి జ‌రిగింది. దాంతో అక్క‌డ యువ‌కులు షాపుల‌కు నిప్పు పెట్టారు. దీంతో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొన‌గా పోలీసులు రంగంలోకి దిగారు. చొర‌బాటు దారులే ఈ దాడికి పాల్ప‌డి ఉంటార‌ని అనుమానిస్తున్నారు,

Advertisement

ఒమిక్రాన్ లో మ‌రో ర‌కాన్ని గుర్తించారు. ఒమిక్రాన్ వేరియంట్ లో ఎక్స్ ఈ అనే మ‌రో రకాన్ని గుర్తించారు. ఈ వేరియంట్ కు వేగంగా వ్యాప్తి చెందే ల‌క్ష‌ణం ఉన్న‌ట్టు ప్రపంచ ఆరోగ్య‌సంస్థ హెచ్చ‌రించింది.

modi
ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోడీ రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. పేద‌ల‌కు సేవ చేసేలా రంజాన్ మాసం స్పూర్తిని క‌లిగించాల‌ని అన్నారు. స‌మాజంలో శాంతి సామ‌రస్యాలు పెంపొందాల‌ని పేర్కొన్నారు.

Advertisement

ప‌ద‌మూడు రోజుల్లో పెట్రోల్ ధ‌ర‌లు 11 సార్లు పెరిగాయి. పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌టంతో వాహ‌నదారులు ఆందోళ‌న వ్య‌క్తి చేస్తున్నారు.

ఏపీలో రేప‌టి నుండి కొత్త జిల్లాలు అమ‌లులోకి రానున్నాయి. ఈ నేప‌థ్యంలో 26 జిల్లాల‌కు ఎస్పీల‌ను , క‌లెక్ట‌ర్ ల‌ను నియ‌మిస్తూ స‌మీర్ శ‌ర్మ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

అమెరికాలో తెలుగువారికి మ‌రో గౌర‌వం ద‌క్కింది. ఉగాదిని తెలుగు భాషా వార‌స‌త్వ దినంగా టెక్సాస్ గ‌ర‌ర్న‌ర్ ప్ర‌క‌టించారు.

బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డారు. దాంతో ఆమెను వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నారు. మూడు కార్లు ఢీ కొన‌డంతో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.

నంది అవార్డుల ప్ర‌ధానోత్స‌వాన్ని ప‌క్క‌న పెట్టేశార‌ని న‌టుడు నిర్మాత ముర‌ళీ మ‌నోహ‌ర్ అవేద‌న వ్య‌క్తం చేశారు. ఏళ్లుగా నంది అవార్డుల‌ను ఇవ్వ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు.

లండ‌న్ లో పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ పై దాడి జ‌రిగింది. న‌వాజ్ ష‌రీఫ్ బాడీగార్డుకు తీవ్ర‌గాయాలు అయ్యాయి. నేడు పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మాణం ఎదురుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కాగా పీటీఐ పార్టీనేత ఈ దాడికి పాల్ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading