Telugu News » Blog » APRIL 30th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

APRIL 30th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY

కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ ఛార్చి మానిక్కం ఠాగూర్ నేడు వ‌రంగ‌ల్ ప‌ర్య‌టించ‌నున్నారు. మే 6న రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను మానిక్కం ఠాగూర్ ప‌రిశీలించ‌నున్నారు.

Ads

కేంద్రానికి రోగం వచ్చింది, చికిత్స చేయాలి, కేంద్రం, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది అంటూ కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కూల్చివేతలు సులువు, దేశాన్ని నిర్మించడం కష్టం, ఇక్కడ అల్లరి చేసేవాళ్ల ఆటలు సాగవంటూ కేసీఆర్ కేంద్రం పై నిప్పులు చెరిగారు.

ఏపీ మంత్రి రోజా ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ ను క‌లిసారు. కేసీఆర్ త‌న‌ను కూతురులా చూస్తార‌ని ఆశీర్వాదం తీసుకునేందుకు వ‌చ్చాన‌ని రోజా ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.

12-17 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సువారికి మ‌రో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. కోవావ్యాక్స్ కు ఎన్ టాగీ అనుమ‌తిచ్చింది.

ఆఫ్గ‌న్ రాజ‌ధాని కాబూల్ లో మ‌రోసారి బాంబుల మోత మోగింది. కాబూల్ మ‌సీదులో ఆత్మాహుతి దాడి జ‌రిగింది. సున్నీముస్లీం లే ల‌క్ష్యంగా జ‌రిగిన ఈ దాడిలో 78 మంది మ‌ర‌ణించారు.

ఏపీ స‌ర్కార్ పై మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి. కాగా తాజాగా మ‌రోసారి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎ జ‌గ‌న్ త‌న సోద‌ర స‌మానుడ‌ని అన్నారు. ఏపీ అభివృద్ది చెందాలని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. అన్యాక్రాంతంగా ఆ మాట‌లు వ‌చ్చాయ‌ని దురుద్దేశ్యంతో ఆ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని చెప్పారు.

Ads
bigg boss telugu 6

bigg boss telugu 6

బిగ్ బాస్ షో పై ఏపీ హైకోర్ట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. బిగ్ బాస్ లాంటి షో ల వ‌ల్ల స‌మాజంలో విప‌రీత పోక‌డ‌లు పెరిగిపోతున్నాయ‌ని ప్ర‌క‌టించింది. 2019లో బిగ్ బాస్ అశ్లీల‌త‌..అస‌భ్య‌త‌ను పెంచేలా ఉందంటూ కేతిరెడ్డి జ‌గ‌దీశ్ రెడ్డి అనే వ్య‌క్తి దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై హైకోర్టు ఈ ర‌కంగా స్పందించింది.

మ‌హిళా కానిస్టేబుల్ పై దుర్బాష‌లాడాడ‌ని ఆరోపిస్తూ గుజ‌రాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని పై కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. దాంతో జైలుకు వెళ్లిన ఆయ‌న నిన్న బెయిల్ పై బ‌ట‌య‌కు వ‌స్తూ పీఎంఓ లో నాయ‌కుల సూచ‌న‌ల మేర‌కు త‌న‌పై కుట్ర జరింద‌ని అన్నారు. అంతే కాకుండా త‌గ్గేదే లే అంటూ పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ డైలాగ్ ను కొట్టారు.

దేశంలో త‌గ్గిపోతున్న బొగ్గునిల్వ‌ల‌తో 16 రాష్ట్రాల్లో క‌రెంట్ కోత‌లు కనిపిస్తున్నాయి.ఢిల్లీ, రాజ‌స్థాన్, పంజాబ్, యూపీ స‌హా మొత్తం 16 రాష్ట్రాల్లో కోత‌లు విధిస్తున్నారు.

దేశంలో పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు సెంచ‌రీ దాటిన సంగ‌తి తెలిసిందే. కాగా కేంద్ర చ‌మురుశాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. పెట్రోల్ ధ‌ర‌లు చాలా త‌క్కువ పెంచామని కామెంట్స్ చేశాడు. దాంతో నెటిజ‌న్లు ఆయ‌న‌పై ఫైర్ అవుతున్నారు.