Home » APRIL 2nd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

APRIL 2nd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

హైదరాబాద్‌ ఎక్సైజ్ అండ్ ఎన్‌ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ లో భారీ బదిలీలు, పదోన్నతులను క‌ల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది.

 

గుంటూరు మంగళగిరిలో మూడు నెలల చిన్నారిని ఆరుసార్లు అమ్మిన ఘటన సంచ‌ల‌నంగా మారింది. ఈ ఘ‌ట‌న‌ను హైకో్ర్టు సుమోటోగా విచారణకు స్వీక‌రించింది. సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆదేశాలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, ఎన్.ఐ.ఏ. డైరెక్టర్, సీబీఐ డైరెక్టర్‌, ఏపీ సీఎస్, డీజీపీలు ప్రతివాదులుగా ఉన్నారు.

Advertisement

తెలంగాణ గ‌వ‌ర్నర్ త‌మిళిసై టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నన్ను ప్రగతిభవన్‌లో ఉగాది కార్యక్రమానికి ఆహ్వానించి ఉంటే ప్రొటోకాల్‌ పక్కన పెట్టి అటెండ్‌ అయ్యేదాన్ని.. యాదాద్రికి వెళ్లాలనుకున్నా.. కానీ, నన్ను ఆహ్వానించలేదు.. నేను వివాదాస్పదం చేసే వ్యక్తిని కాదు.. గ్యాప్‌ని సృష్టించే వ్యక్తిని కాదు అంటూ త‌మిళిసై ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

corona vaccine

క‌రోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఉత్ప‌త్తిని భార‌త్ బ‌యోటెక్ తాత్కాలికంగా త‌గ్గించిన‌ట్టు ప్ర‌క‌టించింది. టీకాల‌కు డిమాండ్ త‌గ్గ‌టం….స‌ర‌ఫ‌రా త‌గ్గ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

ఊహించిన‌ట్టుగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర‌వాత పెట్రోల్ ధ‌ర‌లు బ‌గ్గుమంటున్నాయి. నేడు హైదరాబాద్ లో పెట్రోల్ ధ‌ర‌లు రూ.116 దాటేశాయి.

Advertisement

హైడ్రోజ‌న్ ఉత్ప‌త్తిలో మేఘా గ్రూప్ రూ.300 కోట్ల పెట్టుబ‌డులు పెడుతోంది. రానున్న కాలంలో హైడ్రోజ‌న్ ప్ర‌త్యామ్నాయ ఇంధ‌నంగా మార‌బోతుంద‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

ఆస్కార్ వేడుక‌లో త‌న భార్య పై జోకులు వేశాడ‌న నటుడు విల్ స్మిత్ ప్రెజెంట‌ర్ రాక్ ను చెంప‌దెబ్బ కొట్టిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా విల్ స్మిత్ ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేశారు. రాక్ ను కొట్ట‌డం క్ష‌మించ‌రాని నేరమని దానికి ఎలాంటి శిక్ష‌వేసినా త‌ను సిద్ద‌మ‌ని అన్నారు.

పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని దానికి సంబంధించి త‌న వ‌ద్ద విశ్వ‌నీయవ‌ర్గాలు అందించిన స‌మాచారం ఉందంటూ వ్యాఖ్యానించారు.

మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ కప్ ఫైన‌ల్ కు రిఫ‌రీగా భార‌త్ కు చెందిన జీఎస్ ల‌క్ష్మి ఎంపిక‌య్యారు. ఏపీకి చెందిన జీఎస్ ల‌క్ష్మి గతంలోనూ ఈ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

Mk Stalin
త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలోని బీజేపీ వ్య‌తిరేఖ శ‌క్తుల్నీ ఏకం కావాల‌ని స్టాలిన్ పిలుపునిచ్చారు. బీజేపీని వ్య‌తిరేఖించే కాంగ్రెస్ తో పాటూ ప్రాంతీయ పార్టీలు అన్నీ ఒకే తాటిపైకి రావాల‌ని స్టాలిన్ పేర్కొన్నారు.

Visitors Are Also Reading