Home » April 26th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

April 26th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

హైద‌ర‌బాద్ ప‌రిధిలో వారం రోజుల్లో సైబ‌ర్ నేర‌గాళ్లు కోటి రూపాయలు కాజేశారు. ఆన్లైన్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో నగరవాసులనే టార్గెట్ చేసుకుని ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం చేశారు. దాంతో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలని సైబర్ క్రైమ్స్ పోలీసులు సూచించారు.

Advertisement

సీఎం జ‌గ‌న్ అనంతపురం నార్పల‌లో పర్య‌టిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌నలో భాగంగా సత్య సాయి విమానాశ్రయానికి జ‌గ‌న్ చేరుకున్నారు.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ ,ఎస్పీ, ట్రస్ట్ నెంబర్ రత్నాకర్ లు జ‌గ‌న్ కు స్వాగ‌తం ప‌లికారు.

ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి బాంబు బెదిరింపు కాల్స్ రావ‌డం క‌ల‌క‌లం రేపింది. మథుర రోడ్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి ఇ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. పోలీసులు స్కూల్ వద్దకు చేరుకున్నాయి.

అనంతపురం తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో 3వ రోజు జేసీ ప్రభాక‌ర్ రెడ్డి దీక్ష‌ కొనసాగుతోంది. ప్రజా సమస్యలను పరిష్కరించాలని టీడీపీ కౌన్సిలర్స్ తో జేసీ దీక్ష చేస్తున్నారు. ఉన్నతాధికారులు వచ్చి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

సిద్దిపేటలోని పోచమ్మ ఆలయంలో చోరీ జ‌రిగింది. ఆలయంలోని హుండీ పగలగొట్టి డబ్బులు దొంగ‌లు డ‌బ్బులు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమల ఒక కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 4 గంటల సమయం ప‌డుతుంది. నిన్న శ్రీవారిని 62,971 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు. 25,574 మంది భక్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు.

కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటించ‌నున్నారు. కడప వైసీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ ను నిర్వ‌హించ‌నున్నారు. అనంతరం మైదుకూరులో పలు కార్యక్రమాల్లో అవినాష్ రెడ్డి పాల్గొననున్నారు.


హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో న‌గ‌రం తడిసిముద్దయ్యింది. పటాన్ చెరు, లింగంపల్లి, గచ్చిబౌలి, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి, కార్వాన్ లో భారీ వ‌ర్షం కురిసింది.

రేపు జగనన్న వసతి దీవెన ప‌త‌కం కింద నిధుల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో వసతి దీవెన నిధుల జమచేయ‌నున్నారు. రూ.912.71 కోట్ల రూపాయ‌ల‌ను వర్చువల్ గా జమ చేయనున్నారు.

Visitors Are Also Reading