Home » APRIL 20th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

APRIL 20th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

పంజాబ్ లోని లూథియానా లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో మంటల్లో చిక్కుకొని ఏడుగురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది.

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల తేదీలపై చర్చ జరగనుంది.

Advertisement

modi

గుజరాత్ లో ప్రధాని మోడీ మూడోరోజు పర్యటిస్తున్నారు. గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో లో పాల్గొనబోతున్నారు.

ఈరోజు ఐపీఎల్ లో ఢిల్లీ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బిజెపి నిరసనలు చేస్తోంది. పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ దీక్ష చేయనున్నారు. సాయి గణేష్ ఆత్మహత్య పై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది.

Advertisement

 

ప్రముఖ సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు 84 అనారోగ్యంతో నేడు కన్నుమూశారు. ఎన్టీఆర్ యమలీల‌ సినిమాకు తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. 1966- 2000 మధ్య ఆయన తెలుగు హిందీ సినిమాలకు దర్శకుడిగా పనిచేశారు.

యాదాద్రిని అభివృద్ధి చేసిన తర్వాత భక్తుల సందడి పెరిగిపోయింది. విదేశీ కరెన్సీ కూడా యాదాద్రిలో కళకళలాడుతోంది. ఆస్ట్రేలియా, అమెరికా, సౌదీ అరేబియా, కతర్, కెనడా, ఇంగ్లాండ్ దేశాలకు చెందిన కరెన్సీ యాదాద్రి హుండీ లో చేరింది.

ఏపీ మాజీమంత్రి రావెల కిషోర్ బాబు మ‌ళ్లీ టీడీపీలో చేరే అవ‌కాశం ఉన్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. నిన్న రావెల చంద్ర‌బాబుతో భేటీ అయిన నేప‌థ్యంలో ఈ వార్త‌లు వినిపిస్తున్నాయి. రావెల గ‌తంలో టీడీపీలో ఉండ‌గా గ‌త ఎన్నిక‌ల్లో జ‌నసేన నుండి పోటీ చేశారు. ఆ త‌ర‌వాత బీజేపీలో చేరారు.

కాంగ్రెస్ నేత ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అధిప‌తులు అంతా త‌న బ్యాచ్ మేట్సే అని వ్యాఖ్యానించారు. ఆర్మీ చీఫ్ గా బాధ్య‌త‌లు చేపట్టనున్న మ‌నోజ్ పాండే తో క‌లిసి ఎన్డీఏ లో పనిచేసిన‌ట్టు తెలిపారు.

నేడు తెలంగాణ‌లో ప‌లు చోట్ల ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాక హెచ్చ‌రించింది.

Visitors Are Also Reading