Home » April 18th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

April 18th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

రైస్ మిల్లర్లతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి భేటీ అయ్యారు. టీటీడీకి లాభాపేక్ష లేకుండా నాణ్యమైన బియ్యాని సరఫరా చేయాలని మిల్లర్లను ఈవో కోరారు. టీటీడీ విజ్ఞప్తికి అనుగుణంగా బియ్యాన్ని సరఫరా చేసేందుకు రైస్‌ మిల్లర్లు అంగీకరించారు.

హైదరాబాద్‌ మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో ఎస్వోటీ సోదాలు నిర్వ‌హిస్తోంది. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. రూ.60 లక్షల నగదు, కంప్యూటర్లు సీజ్ అధికారులు సీజ్ చేశారు.

Advertisement

పెద్దపల్లి జిల్లాలో 33వ రోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొన‌సాగుతోంది. 33వ రోజు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొన‌సాగ‌నుంది. రచ్చపల్లి గ్రామం నుంచి రామాయపల్లి మీదుగా పెద్దపల్లి నియోజకవర్గ పాలితం గ్రామంలోకి భ‌ట్టి ప్ర‌వేశించ‌నున్నారు.

Advertisement

ఏపీలో వడగాలులు వీచే అవకాశం అవ‌కాశాలు ఉన్నాయ‌ని వాతావ‌ర‌ణశాఖ హెచ్చ‌రించింది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు అధికారులు సూచించారు.


తిరుమల 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం ప‌డుతోంది. నిన్న శ్రీవారిని 67,828 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు.

నేడు ఐపీఎల్ లో హైదరాబాద్‌తో ముంబై త‌ల‌పడ‌నుంది. రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జ‌ర‌గ‌నుంది.

ఏపీ సీఎస్‌ జవహార్‌రెడ్డితో ఏపీ ఉద్యోగుల సంఘం సమావేశం కానుంది. సుదీర్ఘంగా 26 డిమాండ్లపై ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. ఆయా శాఖల డిమాండ్లను తక్షణమే పరిష్కారం కొరకు పంపించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Visitors Are Also Reading