Home » Aparichithudu : న్యూస్ పేపర్ చూసి.. అపరిచితుడు సినిమా తీశారా ?

Aparichithudu : న్యూస్ పేపర్ చూసి.. అపరిచితుడు సినిమా తీశారా ?

by Bunty
Published: Last Updated on
Ad

ఇండియా గర్వించదగ్గ దర్శకులలో శంకర్ ఒకరు. హీరోలతో సంబంధం లేకుండా కేవలం పోస్టర్ పైన ఈయన పేరు కనబడితే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడతారు. అలా శంకర్ తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాలలో అపరిచితుడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉండగా…. న్యూస్ పేపర్ లో వచ్చిన ఘటనతో అపరిచితుడు సినిమాను శంకర్ తీశారట.

Advertisement

 

ఈ వివరాల్లోకి వెళితే.. శంకర్ ప్రతి రోజు న్యూస్ పేపర్ చదువుతారట. దర్శకుడు శంకర్ సినిమాలకు సుజాత అనే మహిళ ఆస్థాన రచయిత. ఈమె శంకర్ సినిమాలకు స్క్రిప్టు డెవలప్ చేసే పనిలో ఉండేది. అలాగే కొత్త కథలను వెతికేది. ఒకరోజు న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తను చూసి.. శంకర్ ఆకర్షితుడయ్యాడు. మధురైలో జరిగిన ఓ సంఘటన కరుడుగట్టిన ఒక నేరస్తుడిని ఎలాగైనా పట్టుకోవాలని ఉద్దేశంతో.. ఒక పోలీస్ ఆఫీసర్ అండర్ కవర్ ఆపరేషన్ చేసి ఏకంగా 40 రోజులపాటు భిక్షాటన చేస్తూ ప్రత్యేక అండర్ కవర్ ఆపరేషన్ చేశారు.

Advertisement

Thyview on Twitter: "Masterpiece By @shankarshanmugh . A Path Breaking Film In Indian Cinema Chiyaan Vikram's Once In A Lifetime Performance In Triple Role. 17 Years For #Anniyan /#aparichithudu #17yearsofanniyan https://t.co/oZy4X8tQcS" /

అలా భిక్షాటన చేస్తూ, మాటు వేసి ఆ నేరస్తుడిని పట్టుకున్నారు. ఈ వార్తను శంకర్ సినిమాగా మలచాలని భావించారు. అందుకోసం సుజాత రాసిన స్క్రిప్ట్ తో ఒక చిత్రం కూడా తీశారు. అలా వచ్చిన సినిమానే ఈ అపరిచితుడు. అలా అపరిచితుడు సినిమాలో ప్రకాష్ రాజు మరియు వివేక్ పాత్రలను సృష్టించాడు శంకర్. వారిద్దరూ అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూ… నిందితుణ్ణి పట్టుకుంటారు. అలా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అటు హీరో విక్రమ్ తో పాటు దర్శకుడు శంకర్కు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది ఈ అపరిచితుడు సినిమాతో..!

Visitors Are Also Reading