Home » కరోనా కట్టడికి ఆర్టీసీ కీలక నిర్ణయం…మాస్క్ లేకపోతే పెనాల్టీ కట్టాల్సిందే…!

కరోనా కట్టడికి ఆర్టీసీ కీలక నిర్ణయం…మాస్క్ లేకపోతే పెనాల్టీ కట్టాల్సిందే…!

by AJAY
Ad

దేశం లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు, మాల్స్ , విద్యా సంస్థలు ఇప్పటికే మూసివేశారు. మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను విధిస్తున్నారు. ఇక కరోనా వ్యాప్తి ఎక్కువగా ప్రజలు గుమిగూడే ప్రదేశాలలో వేగంగా జరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement

Aps rtc

బస్సులలో ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంది అంతేకాకుండా దగ్గర దగ్గరగా కూర్చోవాల్సి వస్తుంది కాబట్టి బస్సుల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఏపీ సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రతీ ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించే విధంగా ఓ రూల్ ను తీసుకువచ్చింది. బస్సు ఎక్కిన తర్వాత ఎవరికైనా మాస్క్ లేనట్లయితే వారికి 50 రూపాయల జరిమానా విధించేందుకు ఏపీ ఆర్టీసి సిద్ధమైంది. దాంతో ఇప్పటి నుండి ఏపీలో ఆర్టీసీ బస్సు ఎక్కిన వారు మాస్క్ లేకపోతే 50 రూపాయల జరిమానా కట్టాల్సిందే. ఇక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించే అవకాశం ఉంటుంది.

Advertisement

Visitors Are Also Reading