Home » ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం

ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం

by Anji
Ad

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ‌మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి (50) హఠాన్మ‌ర‌ణం చెందారు. అక‌స్మాత్తుగా గుండెపోటు రావ‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రికి కుటుంబీకులు తీసుకెళ్ల‌గా.. అక్క‌డ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చికిత్స స‌మ‌యంలో ప‌ల్స్ దొర‌క‌డం కూడా క‌ష్ట‌త‌రం అయింద‌ని వైద్య‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి. నెల్లూరు జిల్లాలోని ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గౌత‌మ్‌రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో గెలుపొంది మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

Advertisement

Advertisement

ఐటీ శాఖ‌మంత్రిగా ప‌లు విజ‌యాల‌ను అందించారు. త‌న‌కు ఉన్న నాలెడ్జ్‌తో ఏపీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. టీవీలో వ‌చ్చిన వార్త‌ల్లో చూసేంత వ‌ర‌కు వైసీపీ నాయ‌కుల‌కు ఎవ‌రికీ తెలియ‌దట‌. గ‌త వారం రోజుల కింద‌ట దుబాయ్ ప‌ర్య‌ట‌న‌లో మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి ఉన్నారు. ఐటీ శాఖ‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌పై ఆయ‌న దుబాయ్ వెళ్లారు. దుబాయ్ ప‌ర్య‌ట‌న చూసుకుని నిన్న‌నే హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చారు. ఇవాళ ఉద‌యం గౌతంరెడ్డికి గుండెపోటు రావ‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. హ‌ఠాన్మ‌ర‌ణం పొంద‌డంతో వైసీపీ నేత‌లు పలువురు సంతాపం ప్ర‌క‌టించారు.

Also Read :  దర్శకత్వంలోకి సీనియర్ హీరోయిన్ అడుగులు…!

Visitors Are Also Reading