Home » దర్శకత్వంలోకి సీనియర్ హీరోయిన్ అడుగులు…!

దర్శకత్వంలోకి సీనియర్ హీరోయిన్ అడుగులు…!

by AJAY

సినిమా ఇండస్ట్రీలో మహిళా దర్శకులు చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తూ ఉంటారు. ఎంతమంది ఉన్నారో వేళ్ళ పైనే లెక్కపెట్టవచ్చు. అయితే ఇప్పుడు ఓ టాలెంటెడ్ హీరోయిన్ కూడా దర్శకత్వం వైపు అడుగులు వేస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు. రవితేజ సరసన ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో హీరోయిన్ గా నటించిన కల్యాణియే….ఈ అందాలరాశీ రాజశేఖర్ హీరోగా నటించిన శేషు సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ రవితేజ సరసన ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తరవాత టాలీవుడ్ లో పలు సినిమాలు చేసి అభిమానులను సంపాదించుకుంది. అయితే ఆ తరవాత కొంతకాలానికి సినిమాలకు దూరం అయ్యింది. ఇక ఇటీవలే కళ్యాణి రీ ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా నిర్మాతగా ఓ సినిమా కూడా చేసింది. అయితే ఇప్పుడు దర్శకురాలిగా కూడా కల్యాణి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దం అవుతోంది. తన సొంత బ్యానర్ లో కల్యాణి తెలుగు తమిళ భాషల్లో ఓ సినిమా ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా దర్శకురాలిగా కళ్యాణి కి ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి.

Visitors Are Also Reading