Home » జగన్ సర్కార్ కు భారీ ఊరట… రాజధానిపై హైకోర్టు కీలక తీర్పు..!

జగన్ సర్కార్ కు భారీ ఊరట… రాజధానిపై హైకోర్టు కీలక తీర్పు..!

by Bunty
Ad

అమరావతి రైతులకు చుక్కెదురు అయింది. జోన్ 5 అంశంపై అమరావతి రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ ను ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు తిరస్కరించింది. మరోవైపు ఇళ్ల పట్టాలకు సంబంధించి కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని ఏపీ హైకోర్టు సూచించింది. రాజధాని ఏ ఒక్కరికో, ఒక వర్గానికి పరిమితం కాదని ఏపీ హైకోర్టు ధర్మాసరం వాక్యానించింది. రాజధాని ప్రజలందరికీ అన్నారు. రాజధానిలో పేదలు ఉండకూడదు అంటే ఎలా ఏపీ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

READ ALSO : జూన్‌లో “అమ‌ర‌వీరుల స్మార‌కం” ప్రారంభం..ప్రత్యేకతలు ఇవే

Advertisement

రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమేనని పేర్కొంది. ఫలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వద్దని చెప్పడం కరెక్ట్ కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజధాని భూములు ప్రస్తుతం సిఆర్డిఏనేనని స్పష్టం చేసింది. భూములు ఇచ్చిన వారివి కావని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తున్నానన్నారు. రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులో… కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది.

Advertisement

READ ALSO : Ramabanam Review: ‘రామబాణం’ రివ్యూ.. గోపిచంద్ సాలిడ్ కంబ్యాక్

అమరావతి రాజధాని కేసు .. జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరట | NewsOrbit

నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ విధుల్లో భాగమని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. అమరావతిలోని ఆర్-5 జోన్ లో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం 45 నెంబర్ జీవోను జారీ చేసింది. ఒక్క కుటుంబానికి సెంట్ స్థలం ఇవ్వాలని ప్రభుత్వం ఈ జీవో ద్వారా ప్రకటించింది. 10 లే అవుట్లలో 45000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

READ ALSO : “వయసు”తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్స్…!

Visitors Are Also Reading