ఏపీ నిరుద్యోగులకు అలర్ఠ్. ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలు భర్తీకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 30 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి అమరావతిలోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 17 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని హైకోర్టు రిజిస్టార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 24 ఖాళీలు, బదిలీల ద్వారా మరో 6 ఖాళీల్ని భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.
READ ALSO : ఎన్టీఆర్ ‘దాన వీరశూరకర్ణ’ కు బడ్జెట్ కంటే 15 రేట్లు ఎక్కువ లాభాలు…
Advertisement
Advertisement
కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: మార్చి 17 నుంచి
దరఖాస్తులకు తుది గడువు: ఏప్రిల్ 6 స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్: ఏప్రిల్ 15
కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ టెస్ట్: ఏప్రిల్ 24 (ఉదయం 8:30 నుంచి 10 30 గంటల వరకు)
ప్రిలిమినరీకి/అభ్యంతరల స్వీకరణ ఏప్రిల్ 27
నోటిఫికేషన్ లో ముఖ్యాంశాలు…
మొత్తం పోస్టుల సంఖ్య:30
అర్హత: న్యాయశాస్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ తప్పనిసరి
వయోపరిమితి: 01-03-2023నాటికి 35 ఏళ్లు మించరాదు.
వేతనం:రూ.77,840-రూ.1,36,520
READ ALSO : పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్… అసలు కారణం ఇదే,?