Home » మార్చి 6 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే

మార్చి 6 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే

by Bunty
Ad

ఏపీ నిరుద్యోగులకు అలర్ట్. ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు జనవరి 27న విడుదలైన సంగతి తెలిసిందే. 1:50 నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపిక చేశారు. వీరందరూ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను ఏ మాధ్యమంలో రాస్తారు, పోస్ట్, జోనల్ ప్రాధాన్యత, ఏ సెంటర్లో పరీక్ష రాయాలనుకుంటున్నారు వంటి వివరాలను అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

read also : Amigos OTT Release: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Advertisement

అందుకు మార్చి 6 నుంచి 15వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు ఏపీపీఎస్సీ శనివారం ప్రకటనలో తెలిపింది. కాగా మొత్తం 111 గ్రూప్-1 పోస్టులకు ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టింది. ఇప్పటికే ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించింది. రెండో దశ అయిన మెయిన్స్ పరీక్షలను ఏప్రిల్ 23 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది.

Advertisement

దేశవ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరానికి గాను మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్ సీట్ల భర్తీకి ఆదివారం నీట్ ప్రవేశ పరీక్ష జరగనుంది. నీట్ పీజీలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో ఎండి, ఎంఎస్, పీజి, డిప్లోమా, డిఎన్బి కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీట్ పీజీ-2023 ప్రవేశ పరీక్ష కోసం పది కేంద్రాలను ఏర్పాటు చేశారు.

read also : తెలంగాణలో TRS పేరుతో మరో రాజకీయ పార్టీ..! BRSకు పెద్ద దెబ్బేనా..!

Visitors Are Also Reading