Home » భీమ్లా నాయక్ విడుదల నేపథ్యంలో థియేటర్ల యజమానులకు ఏపీ సర్కార్ వార్నింగ్ …!

భీమ్లా నాయక్ విడుదల నేపథ్యంలో థియేటర్ల యజమానులకు ఏపీ సర్కార్ వార్నింగ్ …!

by AJAY
Published: Last Updated on
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా ఈనెల 25న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని థియేటర్లకు ముందస్తుగా నోటీసులు జారీ చేసింది. బెనిఫిట్ షోలు ప్రదర్శించడానికి వీలులేదని నోటీసుల్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. అంతే కాకుండా టికెట్ ధరలు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలని హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని థియేటర్ల యాజమాన్యాలను ప్రభుత్వం హెచ్చరించింది.

Advertisement

Ap cm jagan

Ap cm jagan

అంతేకాకుండా థియేటర్లపై రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుందని స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా తెలంగాణలో మాత్రం భీమ్లా నాయక్ సినిమా 5షోలు వేసేందుకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా కూడా హాజరయ్యారు. ఈ సంద్భంగా పవన్ కళ్యాణ్ కేసీఆర్ కు మరియు మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Visitors Are Also Reading