Home » స‌చివాల‌య ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఈ నెల నుంచే పెరిగిన వేత‌నాలు

స‌చివాల‌య ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఈ నెల నుంచే పెరిగిన వేత‌నాలు

by Anji
Ad

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌చివాల‌య ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం వ‌రుస‌గా శుభ‌వార్త‌ల మీద శుభ‌వార్త‌లు చెబుతోంది. ఇటీవ‌లే జీతాల‌ను పెంచ‌డంతో పాటు జాబ్ ప‌ర్మిట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు ప్రొబెష‌న్ ఖ‌రారు త‌రువాత ఈ నెల నుంచే కొత్త పీఆర్సీ పే స్కేల్ ప్ర‌కారం.. పెరిగిన వేత‌నాలు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. పే స్కేలుతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, అల‌వెన్స్‌లు క‌లిపిన వేత‌నాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ‌లో ఖాతాల ఏర్పాటుతో పాటు అద‌న‌పు బ‌డ్జెట్ కేటాయింపులు చేసింది.


ప్ర‌త్యేకంగా గ్రామ స‌చివాల‌యాల ఉద్యోగుల వేత‌నాల కోసం కేటాయించిన రూ.768.60 కోట్ల అద‌న‌పు నిధుల‌ను విడుద‌ల చేసేందుకు ఆర్థిక శాఖ కేవీవీ స‌త్య‌నారాయ‌ణ ఉత్త‌ర్వుల‌ను జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్స‌రంలో గ్రామ స‌చివాల‌య ఉద్యోగుల వేత‌నాల కోసం ఇప్ప‌టికే  రూ.1,995 కోట్లు విడుద‌ల చేయ‌గా.. తాజాగా విడుద‌ల చేసినట్టు ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి ఆదేశాల్లో తెలిపారు. ఇక వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు కూడా పెరిగిన వేత‌నాలు ఈ నెల నుంచే రానున్నాయి. ఇందుకు సంబంధించిన అద‌న‌పు నిధుల‌ను నేడో రేపో విడుద‌ల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్త‌ర్వులు జారీ చేయ‌నుంది.

Advertisement

Advertisement


జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇచ్చిన మాట ప్ర‌కారం.. స‌చివాల‌యాల ఉద్యోగుల‌కు కొత్త వేత‌నాలు చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విష‌యంపై ఏపీ సీఎం జ‌గ‌న్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు ఉద్యోగులు. వార్డు స‌చివాల‌యాల ఉద్యోగుల‌కు పెరిగిన జీతాల జీవో కూడా వేరుగా విడుద‌ల‌వుతుంద‌ని చెప్పారు. ప్రొబేష‌న్ డిక్లేర్ అయిన ఉద్యోగులెవ్వ‌రూ ఆందోళ‌న పడ‌వ‌ద్ద‌ని.. అంద‌రికీ పే స్కేల్ ప్ర‌కారమే వేత‌నాలు వ‌స్తాయి అని సూచించారు. ప్రొబేష‌న్ పూర్తి చేసుకున్న గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు పెరిగిన జీతాలు అందుతాయ‌ని గ్రామ‌, వార్డు స‌చివాలయ ఎంప్లాయిస్ అసోసియేష‌న్ అధికారులు వెల్ల‌డించారు.

Also Read : 

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క…వరుడు ఎవరంటే…?

మ‌రోసారి నెటిజ‌న్ల‌కు అడ్డంగా దొరికిపోయిన మంచు లక్ష్మి….నెట్టింట దారుణ‌మైన ట్రోల్స్..!

 

Visitors Are Also Reading