Home » మ‌రోసారి నెటిజ‌న్ల‌కు అడ్డంగా దొరికిపోయిన మంచు లక్ష్మి….నెట్టింట దారుణ‌మైన ట్రోల్స్..!

మ‌రోసారి నెటిజ‌న్ల‌కు అడ్డంగా దొరికిపోయిన మంచు లక్ష్మి….నెట్టింట దారుణ‌మైన ట్రోల్స్..!

by AJAY
Ad

సెల‌బ్రెటీలు కొన్ని సార్లు సోష‌ల్ మీడియాలో మిస్టేక్స్ చేసి దొరికిపోతుంటారు. అనుకోకుండా చేసిన మిస్టేక్ వ‌ల్ల ట్రోల్స్ భారిన ప‌డ‌తారు. ఇక తాజాగా మంచు ల‌క్ష్మి కూడా అలాంటి ఓ చిన్న త‌ప్పు చేసి ట్రోలర్స్ కు దొరికిపోయింది. దాంతో నెటిజ‌న్లు ఆడుకుంటున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో భోనాల పండుగ సెల‌బ్రేష‌న్స్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ లో ఏ గ‌ల్లీని చూసిన భోనాల పండుగ సంద‌డే క‌నిపిస్తుంది.

Advertisement

ప్రతి గుడిని భోనాల పండుగ కోసం సిద్దం చేశారు. ఇక పండుగ‌ల వేళ సెల‌బ్రెటీలు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి శుభాకాంక్ష‌లు చెప్ప‌డం సహ‌జ‌మే. అయితే మంచు ల‌క్ష్మి కూడా భోనాల పండుగ శుభాకాంక్ష‌లు చెబుతూ సోష‌ల్ మీడియాలో త‌న ఫోటోను షేర్ చేసింది. అయితే భోనాల పండుగ‌కు మంచు ల‌క్ష్మి బ‌తుక‌మ్మ‌ను ఎత్తుకుని ఉన్న ఫోటోను జోడింది. దాంతో ల‌చ్చ‌క్క‌కు బతుక‌మ్మ కి భోనాల పండుగ‌కు తేడా తెలియ‌డం లేదు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

ఇక త‌న‌కు వ‌స్తున్న కామెంట్స్ ను చూసుకున్న మంచు ల‌క్ష్మి ఫోటోను గంట సేప‌టికే ట్విట్ట‌ర్ నుండి తొలగించింది. అయిన‌ప్ప‌టికి నెటిజ‌న్లు మామూలోళ్లు కాదు కాబ‌ట్టి స్క్రీన్ షాట్ తీసిపెట్టుకుని దాంతో ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా రీసెంట్ మంచు ల‌క్ష్మీ ఓ గొప్ప ప‌ని చేసి కూడా ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు.

Manchu laxmi

Manchu laxmi

తెలంగాణ‌లో మంచు ల‌క్ష్మి 50 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను ద‌త్త‌త తీసుకున్నారు. సొంత డ‌బ్బుతో ఆ పాఠ‌శాల‌ల‌కు మ‌ర‌మ‌త్తులు చేయించ‌నున్నారు. ఇదిలా ఉంటే సినిమాలు టీవీ షోలు చేస్తూ మంచు ల‌క్ష్మి ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచుతున్నారు.

Visitors Are Also Reading