Telugu News » Blog » మూడు రాజ‌ధానుల‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..?

మూడు రాజ‌ధానుల‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..?

by Anji
Ads

ఏపీ అసెంబ్లీ లో వికేంద్రీకరణ పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానుల వికేంద్రీకరణ పై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.వ్యవస్థల పరిధిపై రాజ్యాంగం స్పష్టత ఇచ్చిందంటూ పేర్కొన్నారు. రాజ్యాంగంలో ప్రతి వ్యవస్థ స్వతంత్రమైన దేనని తెలిపారు. వ్యవస్థలు ఎవరి పరిధిలో వారు ఉంటే సమస్యలు రావని అన్నారు. మిగిలిన వ్యవస్థలన్నీ సజావుగా సాగుతాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డాడు. చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థకు ఉంటుందంటూ సీఎం జగన్ స్పష్టం చేశారు.

Advertisement


శాసన వ్యవస్థ చట్టాలు చేయకూడదని కోర్టులో చెప్ప లేవని తెలిపారు. చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థ కు ఉంటుందని తెలిపారు. మంచి చట్టాలు చేస్తే ప్రజలు మరల ఎన్నుకుంటారని తెలిపారు. రాజ్యాంగాన్ని రాష్ట్ర అధికారాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి ప్రాంతం పై ప్రేమ ఉందని అందుకే తాను ఇక్కడ ఇల్లు కట్టుకున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు చట్టాలు నచ్చకపోతే ప్రజలే నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు మంచి చట్టాలు చేస్తే ప్రజలు మరలా ఎన్నుకుంటారని జగన్ అభిప్రాయపడ్డారు.

Advertisement

గ‌త ప్ర‌భుత్వం చేసిన విధానాలు న‌చ్చలేదు కాబ‌ట్టే ప్ర‌జ‌లు తమకు తీర్పు ఇచ్చారని ఇది ప్రజాస్వామ్యం గొప్పతనం అని తెలిపారు. ఆరు నెలల్లో రాజధానిని వేల కోట్లతో పూర్తిచేయాలని చెప్పడం సాధ్యం కాని టైం లైన్ నిర్దేశించడం సరికాదంటూ సీఎం వ్యాఖ్యానించారు. మొదటి తెలంగాణ ఉద్యమం అభివృద్ధి లేకపోవడం వల్ల వచ్చిందని.. రెండోసారి తెలంగాణ ఉద్యమం అభివృద్ధి అంతా ఒకే దగ్గర ఉండటం వల్ల వచ్చిందంటూ జగన్ పేర్కొన్నారు. వికేంద్రీకరణ వల్ల ఏపీ అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీని చెప్పిందన్నారు. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకొని మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చాను అంటూ జగన్ పేర్కొన్నారు. ధ‌ర్మాస‌నం విశ్వాసం ఉంద‌ని.. హైకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకుంటామని సీఎం చెప్పారు అమరావతి రైతులకు అండగా ఉంటామని రైతుల ప్రయోజనాలను కాపాడుతామని పేర్కొన్నారు. అందరికీ మంచి చేయడానికి తమ ప్రభుత్వం ఉందన్నారు.

Advertisement

Also Read :  భ‌గ‌త్ సింగ్ వ‌ర్థంతి రోజే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!