Home » భ‌గ‌త్ సింగ్ వ‌ర్థంతి రోజే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

భ‌గ‌త్ సింగ్ వ‌ర్థంతి రోజే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

by Anji
Ad

స్వాతంత్య్ర స‌మ‌రయోధుడు భ‌గ‌త్‌సింగ్‌ని చంపిన రోజున భ‌గ‌త్‌సింగ్ బ‌లిదానం చేసిన ష‌హీద్ దివాస్ సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించిన పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌త్‌సింగ్ రాజ్‌గురు సుఖ్‌దేవ్‌ల విగ్ర‌హాల వ‌ద్ద నివాళి అర్పించారు. ఆ త‌రువాత ఆయ‌నో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసారు. పంజాబ్ రాష్ట్రంలో అవినీతిని రూపుమాపేందుకు వీలుగా ఒక వాట్సాప్ నెంబ‌ర్‌ను ఆయ‌న ప్ర‌క‌టించారు. పంజాబ్ రాష్ట్రంలో ఎవ‌రైనా ఎవ‌రికైనా లంచం ఇవ్వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చినా ఇంకా అలాగే ఎవ‌రైనా అడిగిన వెంట‌నే అస‌లు మ‌రొక ఆలోచ‌న అనేదే చేయ‌కుండా 9501200200 వాట్సాప్ నెంబ‌ర్‌కు వివ‌రాలు పంపాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. స్వాతంత్య్ర భ‌గ‌త్‌సింగ్ జీవిత త్యాగం చేసిన రోజునే దీనిని లాంచ్ చేయ‌డం చాలా గొప్ప విశేషమ‌ని చెప్పాలి. ఈ విష‌యాన్ని పంజాబ్ సీఎం సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేశారు.

Advertisement


పంజాబ్ రాష్ట్రాన్ని అవినీతి ర‌హిత రాష్ట్రంగా మార్చేందుకు వీలుగా ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. అంతేకాదు.. ఈ వాట్సాఫ్ నెంబ‌ర్ కు వీడియో లేదంటే ఆడియో క్లిప్‌ను క‌నుక పంపితే దానిని ముఖ్య‌మంత్రి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న స‌భ్యుల టీమ్ వెరిఫై చేసి వెంటనే త‌గిన చ‌ర్య‌లు చేప‌డుతార‌ని కూడా పేర్కొన్నారు.

Advertisement

అదేవిధంగా పంజాబ్ రాష్ట్రాన్ని అవినీతి నుంచి దూరం చేసే ప్ర‌య‌త్నంలో నిర్ణ‌యాన్ని తీసుకున్నామ‌ని ఇంకా రాష్ట్రాన్ని అవినీతిమ‌యం కాకుండా కాపాడుకునేందుకు స్వాతంత్య్ర స‌మ‌ర యోధుల‌కు ఇచ్చే స‌రైన నివాళిగా పంజాబ్ ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు. మాటల్లోనే కాదు చేత‌ల్లోపై స‌రికొత్త తీరును ప్ర‌ద‌ర్శిస్తున్న పంజాబ్ ముఖ్య‌మంత్రి రానున్న రోజుల్లో మ‌రెన్నీ సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తారో అనేది చూడాలి. ఇ క ఏమైనా కానీ తాజా నిర్ణ‌యం భ‌గ‌త్‌సింగ్ స‌రైన నివాళిగానే చెప్పాలి.

Also Read :  తెలంగాణ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. జూన్ 12న ప‌రీక్ష

Visitors Are Also Reading