Home » ఢిల్లీకి ఏపీ సిఐడి పోలీసులు… నారా లోకేష్ అరెస్టు తప్పదా ?

ఢిల్లీకి ఏపీ సిఐడి పోలీసులు… నారా లోకేష్ అరెస్టు తప్పదా ?

by Bunty
Ad

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రాజమండ్రిలో దాదాపు 12 రోజులుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు చంద్రబాబు నాయుడు. జైలు జీవితాన్ని అనుభవిస్తున్న నారా చంద్రబాబునాయుడుకు ఇవాళ బెయిల్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ శుక్రవారం రోజున తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రెండు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి.

AP CID police to Delhi

AP CID police to Delhi

హైకోర్టులో క్యాష్ పిటిషన్ కొట్టివేయగా… తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును రెండు రోజులపాటు సిఐడి కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో తెలుగుదేశం పార్టీ తదుపరి ఏం చేయనుంది అనేది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అటు ఢిల్లీకి వెళ్లిన నారా లోకేష్… అసలు ఈమధ్య కనిపించడం లేదు. పోలీసులు అరెస్టు చేస్తారని భయంతో ఢిల్లీకి వెళ్ళాడని కొంతమంది అంటున్నారు.

Advertisement

Advertisement

nara-bramhini-and-nara-lokesh

nara-bramhini-and-nara-lokesh

ఇలాంటి తరుణంలో….. ఏపీ సిఐడి పోలీసులు ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్ళనున్నారట. ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ ఆధ్వర్యంలో అధికారులు ఢిల్లీకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. దీంతో నారా లోకేష్ ను అరెస్టు చేసేందుకు అధికారులు ఢిల్లీకి వెళ్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఢిల్లీలో నారా లోకేష్ ఏం చేస్తున్నాడు అనే దానిపై ఏపీ సిఐడి పోలీసులు ఆరా తీయనున్నారట. అలాగే నారా లోకేష్ ను అరెస్టు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి ? ముందుకు ఎలా వెళ్లాలి అనే దానిపై కూడా సుప్రీంకోర్టు లీగల్ టీం తో ఏపీ సిఐడి పోలీసులు చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో నారా లోకేష్ కూడా అరెస్టు ఖాయమని ఏపీ రాజకీయాలలో కొత్త చర్చ మొదలైంది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading