Telugu News » Mahalakshmi: డబ్బుకోసం పెళ్లి చేసుకొని.. భర్తను జైలుకు పంపి..ఎంజాయ్ చేస్తుందిగా..?

Mahalakshmi: డబ్బుకోసం పెళ్లి చేసుకొని.. భర్తను జైలుకు పంపి..ఎంజాయ్ చేస్తుందిగా..?

by Bunty

కోలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ సెలబ్రిటీస్ మహాలక్ష్మి, రవీందర్ ఈ జంట గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. వీరు వివాహ అనంతరం తెగ పాపులర్ అయ్యారు. వివాహం అనంతరం వీరిద్దరూ ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. వీరు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటారు. అయితే ఎంతో అందంగా ఉండే మహాలక్ష్మి డబ్బు కోసమే రవీందర్ ను వివాహం చేసుకుందని ఎన్నో వార్తలు వచ్చాయి.

Mahalakshmi Photoshoot While Ravindar Chandrasekaran

Mahalakshmi Photoshoot While Ravindar Chandrasekaran

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వీరిద్దరూ విడిపోయారని, విడాకులు తీసుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే రవీందర్ ఓ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఓ బిజినెస్ వ్యవహారానికి సంబంధించి ఒక వ్యక్తిని మోసం చేయడంతో ఆ వ్యక్తి రవీందర్ పై కేసు పెట్టారు. దీంతో పోలీసులు రవీందర్ ను అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తితో కలిసి రవీందర్ బిజినెస్ చేద్దామని అనుకున్నారు. ఈ క్రమంలోనే బాలాజీ వద్ద నుంచి రవీందర్ 15 కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశారని అధికారులు నిర్ధారించారు.

దీంతో మహాలక్ష్మి తీవ్ర దిగ్భ్రాంతికి గురై అతనికి బెయిల్ వచ్చేలా ప్రయత్నాలు చేసిందట. కానీ కోర్టు దీనిని తిరస్కరించింది. ఈ మధ్యకాలంలో మహాలక్ష్మి డ్యాన్స్ చేస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలాంటి కష్ట సమయంలో డాన్సులు చేయడం ఏంటి అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. భర్తకి అండగా ఉండడం మానేసి రీల్స్ చేస్తున్నావా అని ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆస్తి కోసమే తనని వివాహం చేసుకున్నావు… ఇప్పుడు అతనిని జైలుకు పంపించావు… తన ఆస్తిని కాజేయడానికే ప్లాన్ చేస్తున్నావంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading