Home » ఏపీలో కీల‌క బిల్లుకు ఆమోదం.. ద్వితీయ అధికార భాష‌గా ఉర్దూ

ఏపీలో కీల‌క బిల్లుకు ఆమోదం.. ద్వితీయ అధికార భాష‌గా ఉర్దూ

by Anji
Ad

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ప్ర‌భుత్వం మ‌రొక కీల‌క బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ద్వితీయ అధికార భాష‌గా ఉర్దూను ప్ర‌తిపాదిస్తూ బిల్లును డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ప్ర‌వేశ‌పెట్ట‌గా. అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉర్దూను అధికార భాష‌గా గుర్తించే విధంగా చేసిన సీఎం జ‌గ‌న్‌కు ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎంఅంజాద్‌భాషా ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Advertisement

మ‌రొక వైపు ఏపీలో క‌ల్తీ సారా మ‌ర‌ణాల అంశంలో శాస‌న మండ‌లిలో టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళ‌న చేప‌ట్టారు. సారా మ‌ర‌ణాలు స‌హ‌జ మ‌ర‌ణాలు కాదు అని, ప్ర‌భుత్వ మ‌ర‌ణాలంటూ టీడీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేప‌ట్టారు. మద్య నిషేదంపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

ఈ మేర‌కు మండ‌లి చైర్మ‌న్ పోడియాన్ని చుట్టుముట్టిన ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలను మండ‌లి చైర్మన్ మోషెన్‌రాజు స‌స్పెండ్ చేశారు. స‌భ కార్య‌క్ర‌మాల‌కు అడ్డుప‌డుతున్న టీడీపీ స‌భ్యులు రామ్మోహ‌న్ దువ్వాల రామారావు, ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, బ‌చ్చుల అర్జునుడు, ప‌రుచూరి అశోక్‌బాబు, దీప‌క్‌రెడ్డిల‌ను ఒక రోజు స‌స్పెన్స‌న్ చేయాల‌ని మంత్రి అప్ప‌ల‌రాజు మండ‌లి చైర్మన్‌ను కోరారు. దీంతో ఎమ్మెల్సీల‌పై ఓ రోజు స‌స్పెన్ష‌న్ విధిస్తున్న‌ట్టు మోషేన్ రాజు ప్ర‌క‌టించారు.

Also Read :  నా అనారోగ్యం గురించి తెలియ‌క గ్యాస్ సిలిండ‌ర్ అని వెక్కిరించారు… రాశీకన్నా ఎమోష‌న్..!

Visitors Are Also Reading