ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ రాశీ కన్నా. అయితే అంతకుముందే రాశీకన్నా మద్రాస్ కేఫ్ అనే సినిమాలో నటించింది. కానీ ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లో అభిమానులను సంపాదించుకుంది. ఆ తరవాత టాలీవుడ్ లో వరుస ఆఫర్ లను అందుకుంది. అయితే తాజాగా రాశీకన్నా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. కెరీర్ తొలినాళ్లలో తనను బాడీ షేమింగ్ చేశారని చెప్పింది. సౌత్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో తనను గ్యాస్ ట్యాంకర్ అంటూ రకరకాల పేర్లతో ఎగతాలి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.
Advertisement
Advertisement
rashi khanna
నేను కొద్దిగా లావుగా ఉండేదాన్ని కాబట్టి ఏమీ అనకపోయేదాన్ని అంటూ ఎమోషనల్ అయ్యింది. హీరోయిన్ గా తాను సన్నబడాలి కాబట్టి సన్నగా అయ్యానని…కానీ ఎవరో అన్నారని తాను సన్నగా అవ్వలేదని చెప్పింది. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్ట్ లు పెట్టినా తాను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదని రాశీకన్నా తెలిపింది. తనకు పీసీఓడీ సమస్య ఉందని తెలియకుండా ఏవో ఏవో అనేవాళ్లని ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో మొదట్లో బాధపడేదానని కానీ ఇప్పుడు లైట్ తీసుకుంటున్నా అంటూ రాశీకన్నా తెలిపింది.