Home » కింగ్ ను పొగుడుతూనే విమర్శకులకు అనుష్క కౌంటర్..!

కింగ్ ను పొగుడుతూనే విమర్శకులకు అనుష్క కౌంటర్..!

by Azhar
Ad

గత ఏడాదిలో ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీని చాలా మంది విమర్శించినా విషయం తెలిసిందే. కోహ్లీ ఇక రిటైర్ కావడం మంచిది అని కామెంట్స్ చేసారు. కానీ వారందరికీ గత నెల నుండి తన బ్యాట్ తోనే సమాధానం అనేది ఇస్తున్నాడు కోహ్లీ. నిన్న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కిహ్లి ఇన్నింగ్స్ అందుకు నిదర్శనం. ఈ మ్యాచ్ తర్వాత విరాట్ భార్య అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

Advertisement

కింగ్ కోహ్లీని పొగుడుతూనే విమర్శకులకు అనుష్క కౌంటర్ ఇచ్చింది. నేను నా జీవితంలో అత్యుత్తమ మ్యాచ్ ను ఇప్పుడే చూసాను. దీపావళి ముందు అద్భుతమైన విజయం సాధించి.. అభిమానుల ఆనందం మరింత పెంచారు. మన కూతురు చిన్నది. నేను రూమ్ లో ఎగురుతుంటే… అమ్మ ఇలా ఎందుకు చేస్తుంది అనేది ఆమెకు అర్ధం కాలేదు. ఇలా ఎందుకు అరుస్తుంది అని అనుకుంటుంది.

Advertisement

కానీ ఏదో ఒక్క రోజు వాళ్ళ నాన్న ఓ గొప్ప ఇన్నింగ్స్ అనేది ఆడాడు అని ఆమెకు తెలుస్తుంది. ఇక నీకు నిలకడ లేదు అని కామెంట్స్ చేసిన వారికీ.. ఈ విజయం అనేది చెక్ పెడుతుంది. ఈ గెలుపు మిమంలో మరింత బలంగా చేయాలి అని అనుకుంటున్నాను అని అనుష్క పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ కు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు ప్రతిక్షణం తోడుగా ఉనందుకు ధన్యవాదాలు అని విరాట్ స్పందించాడు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి ఐసీసీ ట్రిబ్యూట్..!

పాకిస్థాన్ ఫ్యాన్ కు లక్షల ఫైన్ వేసిన ఆస్ట్రేలియా..!

Visitors Are Also Reading