Home » ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీలో వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ?? ఏ రోల్ లో అంటే?

ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీలో వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ?? ఏ రోల్ లో అంటే?

by Srilakshmi Bharathi
Ad

ప్రస్తుతం టాలీవుడ్ లో కేజ్రీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాల్లో ప్రాజెక్ట్ K ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నఈ చిత్రంపై ఇప్పటికే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ “ఆదిపురుష్” గా నిరాశపరచడంతో సలార్ సినిమాతో పాటు, ఈ సినిమా పైనే ఆయన ఫాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయంపైనా ఫోకస్ చేస్తున్నారు.

Advertisement

ప్రాజెక్ట్ k సినిమా టైటిల్ ను కల్కి గా డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు దీపిక పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ తో సహా పలువురు టాప్ నటులు నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా కల్కి నుంచి గ్లిమ్ప్స్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ఫాన్స్ అంచనాలను బీట్ చేసేలా ఫస్ట్ గ్లిమ్ప్స్ ను విడుదల చేసారు.దీనితో ఫాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు.

Advertisement

ఈ సినిమాలో ఇతర సెలెబ్రిటీల కేమియోలు ఉంటున్నాయని.. సినిమా ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసారని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే.. ఈ సినిమాలో రాజమౌళి కూడా చేస్తున్నారని, రాజమౌళి పాత్రకి సంబంధించిన కేమియో ఇప్పటికే పూర్తి అయ్యిందని, మరో డైరెక్టర్ ఆర్జీవీ కేమియో కూడా ఉంటుందని కథనాలు వస్తున్నాయి. దీనిలో వాస్తవం ఎంతో తెలియదు కానీ, రామ్ గోపాల్ వర్మ కూడా ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని తెలుస్తోంది.

మరిన్ని..

ఇండియా Vs భారత్ వివాదం.. ఈ 10 దేశాలు పేర్లు మార్చుకున్నాయనే విషయం మీకు తెలుసా ?

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టైటిల్ వెనుక రీజన్ ని.. బయట పెట్టిన దర్శకుడు..!

Visitors Are Also Reading