దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇక ఈ చిత్రం స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ గురించి అద్బుతంగా చిత్రీకరించారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని ఖండంతరాలు దాటించేశారు. మార్చి 25, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. అంతకు ముందు బాహుబలి-2 పేరిట ఉన్న రికార్డులను చెరిపేసి తన పేరిట నమోదు చేసుకుంది.
ప్రధానంగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తం ఉన్న ప్రేక్షకులను మెప్పించిందనే చెప్పాలి. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో మరొక మెట్టు ఎదిగేలా చేసింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు ఖాయమని ఫ్యాన్స్ అంతా చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో బాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్కార్ నామినేషన్‌లలో ఈ చిత్రం వచ్చే అవకాశంపై ఆయన అంచనా వేశారు. ఓ మీడియా అవుట్‌లెట్‌తో తన తాజా ఇంటరాక్షన్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Advertisement
భారత్ నుంచి ఏదైనా చిత్రాన్ని పంపితే ఆర్ఆర్ఆర్ వాస్తవానికి ఆస్కార్ కి నామినేట్ అయ్యే అవకాశం 99 శాతం ఉందని తెలిపారు అనురాగ్ కశ్యప్. ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ వరల్డ్ లో శాశ్వత ముద్ర కలిగి ఉందన్నారు. కచితంగా ఆర్ఆర్ఆర్ సినిమా ఏదో ఒక రంగంలో ఆస్కార్ కి నామినేట్ అవుతుందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరిలో ఆస్కార్ పోటీలో ఉన్నట్టు సమాచారం. ఈ క్యాటగిరిలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు గెలుచుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ ఆస్కార్ అవార్డు కోసం ఓ మంచి సినిమాను ఎంపిక చేయలేకపోతుంది. ఈసారి ఆర్ఆర్ఆర్ తో ఆ కల నిజమవుతుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ సినిమా గతంలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుకి నామినేట్ అయి రన్నరప్‌గా నిలిచింది. ఆర్ఆర్ఆర్ చిత్రంపై హాలీవుడ్ దర్శకులు, నటులు, టెక్నిషియన్లు కూడా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
Also Read :
“అతడు” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ ఇప్పుడు ఎలా ఉన్నాడో..? ఏం చేస్తున్నాడో తెలుసా..?