Home » నాగార్జున హీరో అవ్వడం ఏఎన్ఆర్ కి అస్సలు ఇష్టం లేదు..? కారణం ఏమిటంటే..?

నాగార్జున హీరో అవ్వడం ఏఎన్ఆర్ కి అస్సలు ఇష్టం లేదు..? కారణం ఏమిటంటే..?

by Sravya
Ad

తెలుగు ఇండస్ట్రీకి వచ్చి నాగార్జున మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్ హీరోగా కొనసాగే హీరోలు తమ వారసత్వాన్ని పిల్లలకి అందించాలని అనుకుంటారు. ఇలా ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. అలనే నాగర్జున కూడా తండ్రి నాగేశ్వరావు తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి మంచి పేరును తెచ్చుకొని సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. నాగేశ్వరరావు గారు 75 సంవత్సరాల పాటు కొనసాగుతూ కళామతలకు ఎన్నో సేవలు అందించారు.

Advertisement

Advertisement

ఏఎన్ఆర్ తన కొడుకు నాగార్జున ని హీరోగా పరిచయం చేయాలని ఎప్పుడూ అనుకోలేదట ఈ విషయాన్ని స్వయంగా నాగేశ్వర రావు ఒకసారి చెప్పారు. ప్రస్తుతం నాగార్జున గురించి నాగేశ్వరరావు గారు అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వ్యాపారం వైపు నాగార్జున వెళ్తే బాగుంటుందని అనుకున్నారు నాగేశ్వరరావు. యాక్టింగ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎప్పుడూ కూడా నాగార్జునతో నాగేశ్వరరావు చెప్పలేదట. బిజినెస్ వైపు వెళ్లాలని అమెరికా పంపించి కొలంబియాలో బిజినెస్ కి సంబంధించిన కోర్సుని చదివించారట. కానీ నాగార్జున ఇండియాకి వచ్చి బిజినెస్ ని స్టార్ట్ చేయలేదు. హీరో అవుతానని అన్నారట.

Also read:

Visitors Are Also Reading