Home » పవన్ -ప్రభాస్ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్ మూవీ ?

పవన్ -ప్రభాస్ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్ మూవీ ?

by Anji
Ad

సాధారణంగా ఇద్దరూ స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారంటే అభిమానులు సంబురపడుతుంటారు. గతంలో ఎన్టీఆర్-ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఈ స్టార్ హీరోలంతా కలిసి చాలా సినిమాల్లో నటించారు. టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్-వెంకటేష్, మహేష్ బాబు-వెంకటేష్, ఎన్టీఆర్-రామ్ చరణ్ చిరంజీవి-రవితేజ ఇలా చాలా మంది స్టార్ హీరోల కాంబోలో సినిమాలు వచ్చాయి. తాజాగా పవన్ కళ్యాణ్-ప్రభాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని ఓ పోస్టర్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Advertisement

ఇకపోతే ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ పుల్ బ్లాక్ కాస్ట్యూమ్ తో ఉన్నారు. అలాగే గతంలో సాహో సినిమాలో ప్రభాస్ సైతం బ్లాక్ కాస్ట్యూమ్ లో ఉన్న ఫోటోని తీసుకొని పవన్, ప్రభాస్ ని పెట్టి ఫుల్ కిక్ ఇచ్చారు ట్రోలర్స్. ఈ పోస్టర్ ని చూసిన కొందరూ ఇది కనుక నిజమైతే థియేటర్లు దద్దరిల్లిపోాయని చెబుతున్నారు. ఓజీలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్.. సాహోలో ప్రభాస్ క్యారెక్టర్ వీరిద్దరి సినిమాల్లో ఎక్కువగా వెపన్స్ యూస్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే సూపర్ ఉంటుంది.

Advertisement

పవన్ కళ్యాణ్ ఏమో ప్రభాస్ కి బ్రదర్ అవుతాడు. ఈ సినిమాకి ఒక డైలాగ్ కూడా ఉంది. ఇద్దరు అన్నదమ్ములు రౌడీలు.. రౌడీ ప్రభాస్ ఫేస్ చూసిన వెంటనే భయపడి.. అందరికీ ఓ డైలాగ్ చెబుతాడు. ఇప్పుడు వీడిని మనం చంపి ఇంటికెళ్దాం అనుకుంటున్నారా..? అక్కడికి వెళ్లే లోపే అవి స్మశానాలుగా మారి ఉంటాయి. ఆ స్మశానాల్లోనే వీడి అన్న మనవి పాతేస్తాడు అని చెప్పుకొస్తాడు. వాడి అన్న అర్జున్ పాల్వి.. అతనే పవన్ కళ్యాణ్.. వీరిద్దరినీ పెట్టి సినిమా తీస్తే.. ఇక అంటే అంటున్నారు ఫ్యాన్స్.  ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading