కుటుంబ సంబంధాలు, అనుబంధాలు, ప్రేమానురాగాల నేపథ్యంలో తెలంగాణ చిత్రంగా ప్రేక్షకులముందుకొచ్చిన సినిమా బలగం. స్టార్ కమెడీయన్ వేణు యెల్దండి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తాను దర్శకత్వం వహించిన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించాడు. తెలంగాణ పల్లెల్లోని, కుటుంబాల్లోని ఎమోషన్స్ ని తెరపైకి తీసుకొచ్చి ప్రశంసలు అందుకుంటున్నారు. మార్చి 03న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
Also Read : శ్రీదేవి డ్రామా కంపెనీకి సుధీర్ ఎంట్రీ.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!
Advertisement
ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతోంది. మరోవైపు అవార్డులను దక్కించుకుంటోంది. తాజాగా అందించిన అవార్డుతో కలుపుకొని మొత్తం నాలుగు అవార్డులు సొంతం చేసుకుంది. తొలుత ఉగాది సందర్భంగా తెలుగు సినిమా వేదిక నుంచి నంది అవార్డు వరించింది. ఈ విషయాన్ని దర్శకుడు వేణు తెలియజేస్తూ.. చాలా సంతోషం వ్యక్తం చేశారు. రెండు రోజుల కింద రెండు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. లాస్ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాలలో అవార్డులను దక్కించుకుంది. తాజాగా ఉక్రెయిన్ లోని ఒనికో ఫిల్మ్ అవార్డు నుంచి బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విబాగంలో అవార్డును సొంతం చేసుకుంది. బలగం చిత్రానికి మొత్తం నాలుగు అవార్డులు దక్కాయని దర్శకుడు వేణు సంతోషం వ్యక్తం చేశారు.
Advertisement
ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన బలగం ప్రేక్షకాదారణ పొందుతూనే అవార్డులను సైతం దక్కించుకుంటోంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద తగిన కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమాకి వేణు దర్శకత్వం వహించగా.. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ప్రియదర్శి కావ్య, కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తో పాటు రచ్చరవి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో అందించింన సంగీతం చాలా అద్భుతం.
Also Read : ఇన్ స్ట్రాగ్రామ్ లోకి దళపతి విజయ్.. గంటలోనే ఫాలోవర్స్ ఎంతమంది అంటే?