Home » కోలీవుడ్ లో బాలయ్య క్రేజ్… అన్ స్టాపబుక్ షో పై అనిరుధ్…!

కోలీవుడ్ లో బాలయ్య క్రేజ్… అన్ స్టాపబుక్ షో పై అనిరుధ్…!

by AJAY
Published: Last Updated on
Ad

తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాను తమిళ్ లో కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అల్లు వారి ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా తెలుగులో ఎంతో వినోదాన్ని పంచి మంచి సక్సెస్ సాధించింది. దాంతో తమిళ్ లో కూడా ఆహాను విస్తరించారు. ఈ సందర్భంగా తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులతో ఆహా చెన్నైలో ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ కు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిరుధ్ ఆసక్తికర కామెంట్ లు చేశాడు. ప్రతి ఒక్కరూ ఆహాను తెలుగు లో చూశారని అన్నాడు.

Advertisement

Advertisement

ముఖ్యంగా ఆహాలో అన్ స్టాపబుల్ టాక్ షో బాగుందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తాను కూడా యూట్యూబ్ లో ఈ టాక్ షో ప్రోమోలు చూశానని చెప్పారు. తమిళ్ లో కూడా ఆహా మంచి విజయం సాధించాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదిలా ఉంటే బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో పై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళ సంగీత దర్శకుడు సైతం ప్రశంసలు కురిపించడంతో బాలయ్య క్రేజ్ తమిళ ఇండస్ట్రీ వరకు వెళ్లి పోయినట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading