Home » 20 ఏళ్ల వయసులోనే డేటింగ్.. చివరికి మోసపోయిన హీరోయిన్..!

20 ఏళ్ల వయసులోనే డేటింగ్.. చివరికి మోసపోయిన హీరోయిన్..!

by Anji
Ad

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ కోలీవుడ్ నటి ఆండ్రియా.. నిత్యం ఏదో ఒక సంచలన కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుంటుంది.  బోల్డ్ క్యారెక్టర్ లో నటించడమే కాదు.. బోల్డ్ వ్యాఖ్యలతోనూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుంది. మొన్నటికి మొన్న తాను ఒక వ్యక్తిని నమ్మి సహజీవనం చేసి మోసపోయానని తెలిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. అతని వల్ల శారీరకంగా, మానసికంగా వేదనకు గురయ్యానని చెప్పిన ఆండ్రియా.. గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.

Advertisement

ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాలతో బిజీగా మారింది బ్యూటీ. ప్రస్తుతం ఆండ్రియా హీరోయిన్ తెరకెక్కిన అనల్ మే లే పనితులి అనే చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ఈ సినిమాతో పాటు పిశాచి 2 చిత్రంలోనూ నటిస్తోంది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా.. తాజాగా  జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆండ్రియా మరోసారి సంచలన  కామెంట్స్ చేసింది. తాను 20 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డానని చెప్పిన ఆండ్రియా.. అతనితో పెళ్లి కూడా చేసుకోవాలుకున్నానని కానీ వర్కవుట్ కాలేదని చెప్పుకొచ్చింది. ఆ వ్యక్తి తనను చాలా దారుణంగా మోసం చేశాడని తెలిపింది.  

Advertisement

Also Read :  సెట్ బ‌య‌ట నిలుచున్న చిరంజీవిని తిట్టిప‌డేసిన స్టార్ ప్రొడ్యూసర్.. ? ఆయ‌న ఎవ‌రంటే..?

పెళ్లిపై తనకు ఉన్న అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టి చెప్పింది తనకు ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలిపిన ఆండ్రియా జీవితంలో ఆనందంగా గడపాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకున్న తరువాత చాలా మంది యువతులు సంతోషంగా లేరని పేర్కొన్న ఆండ్రియా పెళ్లి చేసుకోకుండా చాలా మంది సంతోషంగా జీవిస్తున్నారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అయితే పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్న ఆండ్రియా భవిష్యత్ లో తన ఆలోచనను మార్చుకుంటుందో లేదో చూడాలి మరి. 

 Also Read :  చిరంజీవిపై ప్రధాని ప్రశంసలు.. భావోద్వేగ ట్వీట్ చేసిన మెగాస్టార్..!

Visitors Are Also Reading