Home » చిరంజీవిపై ప్రధాని ప్రశంసలు.. భావోద్వేగ ట్వీట్ చేసిన మెగాస్టార్..!

చిరంజీవిపై ప్రధాని ప్రశంసలు.. భావోద్వేగ ట్వీట్ చేసిన మెగాస్టార్..!

by Anji
Ad

గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 పురస్కారం వరించింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నటుడిగా 150కి పైగా చిత్రాలలో నటించి వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారని.. ఆయనది ప్రత్యేకమైన కెరీర్ అని అబినందిస్తూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. దేశంలోనే అత్యంత ప్రముఖుల్లో ఒకరిగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. 

Advertisement

ఇక చిరంజీవికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా చిరుపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. “చిరంజీవి విలక్షణమైన నటుడు.. అద్భుతమైన వ్యక్తిత్వంతో విభిన్న నటనాచాతుర్యంతో పలు పాత్రలను పోషించి ఎన్నో తరాల ప్రేక్షకుల అభిమానం, ఆదరణ పొందుతున్నారు. గోవాలో జరుగుతున్న భారత చలనచిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైనందుకు ఆయనకు నా అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు మోడీ.   

Advertisement

Also Read :   సెట్ బ‌య‌ట నిలుచున్న చిరంజీవిని తిట్టిప‌డేసిన స్టార్ ప్రొడ్యూసర్.. ? ఆయ‌న ఎవ‌రంటే..?

ఇక ఐఎఫ్ఎఫ్ఐ అవార్డు ప్రకటించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ గౌరవం లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనను ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం అభిమానులే అని.. తనపై ప్రేమ చూపిస్తున్న అభిమానులందరి వల్లే తాను ఇక్కడ ఉన్నానంటూ భావోద్వేగానికి లోనయ్యారు చిరంజీవి. ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. 

 Also Read :  ఎన్టీఆర్ అంటే తప్పు.. బాలకృష్ణ అంటే తప్పు కాదా..?

Visitors Are Also Reading