Home » ‘ఆంధ్రుడు’ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూశారా..?

‘ఆంధ్రుడు’ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూశారా..?

by Anji
Ad

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వారు.. అదేవిధంగా నాలుగు, ఐదు సినిమాలతో అభిమానులను భారీగానే సంపాదించుకున్న హీరోయిన్లు ఆ తరువాత ఇండస్ట్రీకి దూరమైన వారు చాలా మందే ఉన్నారు. ఎంతో మంది ఇలాగే సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా అందం, అభినయం ఇలా అన్ని ఉన్నప్పటికీ అవకాశాలు రాక ఇండస్ట్రీకే దూరమయ్యారు. కొందరూ వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమైతే.. మరికొందరూ అవకాశాలు రాక దూరవుతున్నారు. కొంత మంది ఫస్ట్ సినిమాతోనే పాపులరారిటీని సంపాదించుకొని.. ఇక ఆ తరువాత అవకాశాలు లేక ఒకటి,రెండు సినిమాల్లో నటించి ఇండస్ట్రీకి దూరమైన వారు చాలా మందే ఉన్నారు.

Advertisement

అలాంటి వారిలో హీరోయిన్ గౌరి పండిట్ ఒకరు. చాలా మందికి గౌరీ పండిట్ అంటే గుర్తు ఉండకపోవచ్చు. కానీ గోపిచంద్ హీరోగా నటించిన ఆంధ్రుడు సినిమా హీరోయిన్ అంటే అందరూ గుర్తు పట్టేస్తారు. 2005లో పరుచూరి మురళీ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రుడు సినిమాతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైంది గౌరీ పండిట్. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అంతేకాదు.. తొలి సినిమాతోనే భారీ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది హీరోయిన్. ఈ చిత్రంలో అల్లరి,దు:ఖం అన్నింటిలో కూడా నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆంధ్రుడు సినిమా తరువాత గౌరీ పండిట్ పలు చిత్రాలలో నటించింది. కానీ అవి ఆమెకు ఆశించిన మేరకు గుర్తింపు సంపాదించలేకపోయాయి. తెలుగుతో పాటు.. హిందీలో కూడా కొన్ని సినిమాలలో నటించింది. 

Advertisement

Also Read :  కమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాని కాపీ కొట్టబోయి ఫ్లాప్ అయిన చిరంజీవి సినిమా ఏదో తెలుసా ?

Manam News

ఆ తరువాత మెల్లమెల్లగా సినిమాలకు దూరమైంది. 2011లో బాలీవుడ్ నటుడు నిఖిల్ ద్వివేదిని పెళ్లి చేసుకుంది గౌరీ పండిట్. ఈ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఈమె సినిమాల్లో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ గానే ఉంటూ.. తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా గౌరీ ఆమె భర్త, కొడుకుతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆంధ్రుడు సినిమాలో ఉన్న  గౌరీని చూసి..  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోలో ఉన్నది చూసి ఇద్దరూ ఒకటేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వామ్మో గౌరీ పండిట్ అంతలా మారిపోయిందేంటి అని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 

Also Read :  ఉదయ్ కిరణ్, శ్రియా చేయాల్సిన “ఆనందం” చిత్రం చేతులు ఎందుకు మారిందో మీకు తెలుసా ?

Visitors Are Also Reading