Telugu News » Blog » తన ఫస్ట్ లవర్ గురించి బయటపెట్టిన యాంకర్ శ్యామల..అతను కాదట..!

తన ఫస్ట్ లవర్ గురించి బయటపెట్టిన యాంకర్ శ్యామల..అతను కాదట..!

by AJAY
Ads

తెలుగు లో టాప్ యాంకర్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో శ్యామల కూడా ఒకరు. యాంకర్ శ్యామల పలు టీవీ షోల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. అంతేకాకుండా శ్యామల కొన్ని సినిమాలలో నటించి ఆకట్టుకున్నారు. ఎవడు సినిమాలో రామ్ చరణ్ స్నేహితురాలుగా నటించి ప్రశంసలందుకున్నారు. ఆ తర్వాత శ్యామల బిగ్ బాస్ షో లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.

Ads

anchor shyamala

బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్ వ‌ర‌కూ ఉండి త‌న అందం అభిన‌యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇది ఇలా ఉండగా శ్యామల వైసీపీ అధినేత‌ జగన్ ఆధ్వర్యంలో లో వైసీపీ లో చేరి రాజకీయాల వైపు కూడా అడుగులు వేశారు. కానీ అంత యాక్టివ్ గా క‌నిపించ‌లేదు. అంతేకాకుండా తెలంగాణలో శ్యామల షర్మిల వద్దకు వెళ్లి పర్సనల్ గా క‌లిసారు ఈ వార్త‌లు అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారాయి.

Ads
anchor shyamala

anchor shyamala

ఇది ఇలా ఉంటే అప్పుడప్పుడు శ్యామల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు తన కుటుంబానికి సంబంధించిన విషయాలు…. సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. మ‌రో వైపు ఓ యూట్యూ బ్ చాన‌ల్ ద్వారా ప్రస్తుతం అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు. అయితే రీసెంట్ గా శ్యామల ఇన్ స్టాగ్రామ్ లో ప్రశ్నలు అడగండి అంటూ అభిమానులను కోరారు. దాంతో దొరికిందే ఛాన్స్ అని అభిమానులు తమదైన శైలిలో ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ అభిమాని మీ మొదటి లవర్ ఎవరు అంటూ ప్రశ్నించారు.

anchor shyamala

దానికి శ్యామల సమాధానం ఇస్తూ తన భర్తనే త‌న‌ మొదటి ల‌వ‌ర్ అంటూ చెప్పింది. తన భర్త యువరాజ్ ఫోటోని షేర్ చేసి ఇతడే ఇతడే నా మొదటి చివరి ప్రియుడు అంటూ పేర్కొంది. ఇక మరో నెటిజన్ సినిమాలో హీరోయిన్ గా న‌టించే అవకాశం వస్తే చేస్తారా అంటూ ప్రశ్నించాడు. దానికి నో అంటూ త‌ల ఊపుతూ సమాధానం చెప్పింది. ఇదిలా ఉంటే ఓ నెటిజ‌న్ ఏకంగా నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రశ్నించాడు. దానికి కూడా నో అంటూ సమాధానం ఇచ్చింది.

Ad

Also Read: క్వారంటైన్ లో కవిగా మారిపోయిన మెగాస్టార్…ఆ ఫోటో షేర్ చేసి..!