Telugu News » ఓ ఇంటివాడు కాబోతున్న ప్ర‌దీప్…అమ్మాయి ఎవ‌రంటే..!

ఓ ఇంటివాడు కాబోతున్న ప్ర‌దీప్…అమ్మాయి ఎవ‌రంటే..!

by AJAY MADDIBOINA

తెలుగులోని టాప్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు కూడా ఒకరు. మెయిల్ యాంకర్ లో ప్రస్తుతం టాప్ స్థానం లో యాంకర్ ప్రదీప్ ఉన్నాడు. కెరీర్ ప్రారంభంలో యాంకర్ ప్రదీప్ గ‌డ‌స‌రి కోడ‌లు…సొగ‌స‌రి అత్త‌ అనే టీవీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత ఎన్నో టీవీ షోలు చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. ముఖ్యంగా ప్రదీప్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అందువల్లే చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ల‌కు ప్రదీప్ ను హోస్ట్ నియమిస్తూ ఉంటారు. ఇక అప్పట్లో కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అంటూ పలువురు ప్ర‌ముఖ‌ సెలబ్రిటీలతో ప్ర‌దీప్ ముచ్చ‌ట్లు పెట్టించాడు.

Ads
anchor pradeep

anchor pradeep

ఎన్నో ఆసక్తికర విషయాలు రాబట్టాడు. అత్తారింటికి దారేది సినిమాతో పాటూ 100 % ల‌వ్ అనే సినిమాలోనూ న‌టించి అల‌రించాడు. ఇక రీసెంగ్ గా ప్ర‌దీప్ హీరోగా ఓ సినిమాలో న‌టించాడు. కానీ ఈ సినిమా అనుకున్న‌మేర విజ‌యం సాధించ‌లేదు. ఇది ఇలా ఉంటే కెరీర్ ప‌రంగా ఎంతో సక్సెస్ అయిన యాంకర్ ప్రదీప్ కు పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న గత కొంత కాలంగా ఎదుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది.

యాంకర్ ప్రదీప్ రాయలసీమకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కూతురు ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ప్ర‌దీప్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా చేస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే గతంలో కూడా ఇదేవిధంగా ప్రదీప్ పెళ్లి పై అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను ప్ర‌దీప్ కొట్టివేశారు మరి ఈసారైనా ప్ర‌దీప్ ఓ ఇంటి వాడు అవుతాడా లేదా అన్న‌ది చూడాలి.


You may also like