Home » చెత్త‌ప‌ని చేయాలంటూ బ‌ల‌వంతం….జ‌బ‌ర్ద‌స్త్ పై అన‌సూయ ఓపెన్ కామెంట్స్..!

చెత్త‌ప‌ని చేయాలంటూ బ‌ల‌వంతం….జ‌బ‌ర్ద‌స్త్ పై అన‌సూయ ఓపెన్ కామెంట్స్..!

by AJAY
Ad

తెలుగులో టాప్ యాంకర్స్ లో అన‌సూయ కూడా ఒక‌రు. అన‌సూయ మొద‌ట ఓ న్యూస్ ఛాన‌ల్ రో రీడ‌ర్ గా కెరీర్ ను ప్రారంభించి ఆ త‌ర‌వాత జ‌బ‌ర్ద‌స్త్ లో యాంక‌ర్ గా చేసే అవ‌కాశం ద‌క్కించుకుంది. ఇక జ‌బ‌ర్ద‌స్త్ లో ఎంట్రీ తోనే యాంక‌ర్ గా అద‌ర‌గొట్టింది. క‌మెడియ‌న్స్ తో క‌లిసి పంచ్ లు వేస్తూ న‌వ్వించింది. అంతే కాకుండా పొట్టిపొట్టి డ్రెస్ లతో కుర్రాళ్ల మ‌తి పోగొట్టింది.

ALSO READ :విడిపోకూడదని అతని కాళ్లు పట్టుకొని మరీ బ్రతిమాలా.. సంగీత దర్శకుడు కోటి ఆసక్తికరవ్యాఖ్యలు..!

Advertisement

jabardasth anasuya

jabardasth anasuya

జ‌బ‌ర్ద‌స్త్ స‌క్సెస్ లో అన‌సూయ కూడా ఉంద‌ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇక జ‌బ‌ర్ద‌స్త్ లో స‌క్సెస్ అయిన త‌ర‌వాత సినిమా అవ‌కాశాల‌ను అందుకుంది. క్ష‌ణం సినిమాలో త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టింది. అంతే కాకుండా రంగ‌స్థ‌లంలో రంగ‌మ్మ‌త్త పాత్ర చేసి మెప్పించింది. ఇక పుష్ప‌తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. దాంతో ప్ర‌స్తుతం టీవీ షోల‌కు గుడ్ బై చెప్పి సినిమాల‌తోనే బిజీగా మారిపోయింది.

Advertisement

కేవ‌లం తెలుగులోనే కాకుండా త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లో సినిమాలు చేస్తుంది. అయితే జ‌బ‌ర్ద‌స్త్ తో విడ‌దీయార‌ని అనుబంధం ఉన్న అన‌సూయ జ‌బ‌ర్ద‌స్త్ కు సైతం గుడ్ బై చెబుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. వేయికి పైగా ఎపిసోడ్ లు చేసింది కాబ‌ట్టి క‌చ్చితంగా ఆ షోను వీడద‌ని అంతా అనుకున్నారు. కానీ అన‌సూయ జ‌బ‌ర్ద‌స్త్ కూడామానేసింది.

కాగా సోష‌ల్ మీడియా చిట్ చాట్ లో జ‌బ‌ర్ద‌స్త్ పై అన‌సూయ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఓ నెటిజ‌న్ మేడం మ‌ళ్లీ మిమ్మ‌ల్ని టీవీ షోల‌లో చూడాలి అనుకుంటున్నాం..రీ ఎంట్రీ ఎప్పుడు అంటూ ప్ర‌శ్నించాడు. దానికి అనసూయ‌…చెత్త జోగులు…గౌర‌వాన్ని పోగొట్టే టీఆర్పీ స్టంట్ లు లేకుండా పోయిన‌ప్పుడు రీఎంట్రీ ఇస్తా..నేను కూడా టీవీని బాగా మిస్ అవుతున్నా అంటూ రిప్లై ఇచ్చింది.

ALSO READ : తార‌క‌ర‌త్న ఆస్ప‌త్రి బిల్ క‌ట్టింది బాల‌య్య కాదు..ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Visitors Are Also Reading