Home » ఖిలాడి నుండి అనసూయ వచ్చేసింది….బ్లాక్ సారీలో అదిరిపోయే లుక్..!

ఖిలాడి నుండి అనసూయ వచ్చేసింది….బ్లాక్ సారీలో అదిరిపోయే లుక్..!

by AJAY
Ad

జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం నటిగా ఫుల్ బిజీగా మారిపోయింది. మొదటిసారి క్షణం సినిమాలో అనసూయ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో అనసూయ నటనకు మంచి మార్కులు పడటంతో ఆ తర్వాత వరుస ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాతో వ్యాప్తంగా అనసూయ పరిచయం అయింది.

Advertisement

Advertisement

ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలడి సినిమాలో అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనసూయ చంద్రకళ పాత్రలో నటిస్తున్నట్టు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాకుండా అనసూయ పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ లో అనసూయ బ్లాక్ సారీ లో లక్షణంగా కనిపిస్తోంది. సిగ్గుపడుతున్నట్టు అనసూయ లుక్ కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ కు జోడిగా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి నటించారు. ఈ నెల 11న ఈ చిత్రం థియేటర్ల లో విడుదల కానుంది.

Visitors Are Also Reading