టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కెరీర్ ప్రారంభంలో నటిగా ఇండస్ట్రీలోకి వచ్చి… ఆ తర్వాత యాంకర్ గా సెటిల్ అయింది. దాదాపు పది సంవత్సరాలపాటు జబర్దస్త్ యాంకర్ గా అనసూయ భరద్వాజ్ కొనసాగింది. అయితే టాలీవుడ్ సినిమాలలో కూడా వరుసగా అనసూయకు ఆఫర్లు రావడంతో జబర్దస్త్ షోకు గత రెండు సంవత్సరాల కిందట గుడ్ బై చెప్పింది. దీంతో ఫుల్ టైం నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది అనసూయ భరద్వాజ్.
Advertisement
ఇలాంటి నేపథ్యంలోనే అనసూయ భరద్వాజ బిజెపి పార్టీలో చేరతారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వార్తలకు కారణం లేకపోలేదు. ఇటీవల రజాకర్ అనే సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది అనసూయ. అయితే రజాకర్ సినిమాను భారత రాష్ట్ర సమితి పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయితే మత కల్లోలాలు జరిగే అవకాశం ఉందని.. భారత రాష్ట్ర సమితి నేతలు చెబుతున్నారు.
Advertisement
కానీ ఈ సినిమాలో నటించిన అనసూయ… బిజెపికి సపోర్ట్ గా మాట్లాడారు. రజాకర్ సినిమాలో… తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం ఉందని… దీన్ని అందరూ చూడాలని పేర్కొంది అనసూయ. దీంతో అనసూయ బిజెపి పార్టీలో చేరుతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులను చూసిన యాంకర్ అనసూయ స్పందిస్తూ… తనకు రాజకీయాలలోకి రావాలని ఇంట్రెస్ట్ లేదని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
- Sree Leela : ఆ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న శ్రీలీల.. !
- World Cup 2023 : మరోసారి పాక్ తొండాట.. లంకతో మ్యాచ్లోనూ రిపీట్!
- చంద్రబాబుకు ఘోర అవమానం… ఏకంగా హైదరాబాద్ స్టేడియంలోనే ?