జబర్దస్త్ బ్యూటీ అనసూయ బరద్వాజ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఓ వైపు టీవీ షోలు మరోవైపు ఓటీటీ వాటితో పాటు సినిమాలు కూడా చేస్తోంది. అయితే వీటన్నింటిలో బిగ్ స్క్రీన్ పై కనిపించాలన్నదే ప్రతి ఒక్కరికీ ఉండే డ్రీమ్ కాబట్టి అనసూయ కూడా అందరిలాగే సినిమా వచ్చిందంటే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అయితే రీసెంట్ గా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలలో అనసూయ కనిపించడం లేదు. జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలలో కూడా రష్మినే కనిపిస్తుంది. దాంతో అనసూయ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.
Advertisement
jabardasth anasuya
అంతే కాకుండా ఇప్పటి నుండి రష్మినే ఈ షోకు పూర్తి యాంకర్ గా కొనసాగుతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అనసూయ నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ పూర్తయి సినిమా కూడా విడుదలైంది. దాంతో అనసూయ గుడ్ బై చెప్పలేదని కేవలం పర్సనల్ కారణాల వల్లనే జబర్దస్త్ కు దూరంగా ఉందని మళ్లీ వచ్చేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
అంతే కాకుండా ఎన్ని అవకాశాలు వచ్చిన జబర్దస్త్ ను వీడేది లేదని కూడా అనసూయ గతంలో ప్రకటించినట్టు గుర్తు చేసుకుంటున్నారు. మరి అనసూయ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిందా లేదా అన్నది తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే అనసూయ ప్రస్తుతం ఆచి తూచి సినిమాలు చేస్తోంది. పుష్ప పార్ట్ 1 లో అనసూయ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా పార్ట్ 2 లో మాత్రం అనసూయ పాత్ర హైలెగ్ గా ఉండబోతుందని సుకుమార్ చెప్పేశారు. మరోవైపు రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడి సినిమాలో కూడా అనసూయ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది.
also read : నాని శ్యామ్ సింగరాయ్ ట్విటర్ రివ్యూ