దళపతి విజయ్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా మూవీ లియో. ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. అయితే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ మీద పాన్ ఇండియా లెవల్ లో హైప్ క్రియేట్ అయింది. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ తో తెలుగులో కూడా ఫ్యాన్సీ రేట్ కి బిజినెస్ జరిగి 800కి పైగా స్క్రీన్స్ లో విడుదలయ్యేందుకు సిద్ధం అయింది.
Advertisement
అంతా సవ్యంగా సాగుతుందని అనుకుంటున్న సమయంలోనే ఈ చిత్ర యూనిట్ కి ఊహించని షాక్ తగిలింది. తెలుగులో ఈ మూవీ విడుదల వాయిదా వేయాలి అంటూ కోర్టు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. తెలుగులో కూడా ఇంగ్లీషు టైటిల్ విడుదల చేస్తుండటంపై కోర్టు లో వేసిన పిటిషన్ మీద రిలీజ్ వాయిదా వేయాలని కోర్టు తీర్పు ఇచ్చినట్టు సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ సమయంలో వారసుడు తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచినప్పటికీ తెలుగులో ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. లియో విషయంలో నెలకొన్న కాంట్రవర్సి వల్ల ఈసారి కూడా విజయ్ కి తెలుగులో నిరాశ ఖాయం అనిపిస్తోంది.
Advertisement
ఇదిలా ఉంటే.. లియో మూవీ అనౌన్స్ చేసినప్పుడు నెలకొన్న హైప్ తరువాత క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సహా సాంగ్ కి వచ్చిన రెస్పానస్ ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. లియో మూవీ వాయిదా పడినట్టయితే.. తెలుగు బయ్యర్స్ కి చాలా నష్టం వాటిల్లమే కాకుండా మూవీ కలెక్షన్ల మీద కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.యఈ సినిమా పై ఏమాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా తెలుగులో కలెక్షన్లు దారుణంగా పడిపోయే అవకాశముంది. మరోవైపు రవితేజ టైగర్ నాగేశ్వరరావు కాదని.. లియో వంటి డబ్బింగ్ మూవీకి ఎక్కువ థియేటర్స్ కేటాయించడంతో కొంత నెగిటివిటి ఏర్పడే తరుణంలో.. ఇప్పుడు విడుదల వాయిదా పడటం ఈ చిత్రం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి మరీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
లియో దర్శకుడు లోకేష్ కనకరాజ్ మొదటి చిత్రం ‘నగరం’ అప్పట్లో ఎంత వసూలు చేసిందో తెలుసా?