ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని సినీ అభిమానులు ఎవరు ఉండాలి. ఇప్పుడు ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తుంటారు వర్మ. తాజాగారామ్ గోపాల్ వర్మ రూపొందించిన లడ్కీ సినిమాపై కోర్టు స్టే విదించింది. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో వర్మ నిర్మించిన ఈ సినిమా జులై 15న విడుదల అయింది.
Advertisement
అయితే ఈ సినిమా విడుదలను ఆపివేయాలని నిర్మాత కె.శేఖర్ రాజు న్యాయ స్థానాన్ని ఆశ్రయించాడు. అయితే హైదరాబాద్ సివిల్ కోర్టు ఈ సినిమా పై ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో సాప్ట్ వేర్ సుధీర్ సినిమాను తాను రాంగోపాల్ వర్మ దర్వకత్వంలో ఓ సినిమాను నిర్మించాలని సంకల్పించానని ఆ మేరకు ఆయనను కలిశాను అని నిర్మాత శేఖర్ రాజు తెలిపారు. తన వద్ద సినిమా కోసం పలు మార్లు లక్షలాది రూపాయలు తీసుకున్న వర్మ ఎప్పటికప్పుడు దాటవేస్తూ తప్పించుకుంటూ వస్తున్నారని వివరించారు శేఖర్ రాజు.
Advertisement
తన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు సరిగ్గా సమాధానం కూడా చెప్పడం లేదని.. దీంతో తన దగ్గర ఉన్న డాక్యుమెంట్లతో కోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించారు. ఈ తరుణంలోనే జులై 14న సిటీ సివిల్ కోర్టు లడ్కీ సినిమాను అన్ని భాషల్లో ప్రదర్శనను నిలిపి వేస్తూ ఆర్డర్స్ జారీ చేసిందని తెలిపారు. అన్ని రకాల డిజిటల్, ప్లాట్ ఫామ్స్ లో సినిమాను అమ్మడానికి కానీ, బదిలీ చేయడానికి కానీ ప్రదర్శించడానికి వీలు లేకుండా తాత్కాలిక నిషేదం కోరుతూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇదిలా ఉంటే లడ్కీ చిత్రం జులై 15న విడుదలై పాజిటి్ టాక్ తో సందడి చేయడం విశేషం.
Also Read :
ఇక హీరోనే.. నో కమెడియన్ అంటున్న కలర్ ఫొటో హీరో…!
ఆ స్టార్ హీరోయిన్ అన్నతో ఇలియానా లవ్ ఎఫైర్.. సోషల్ మీడియాలో వైరల్..!