Telugu News » Blog » సుకుమార్ శిష్యుల్లో ఇప్పటికీ ఒక్క సక్సెస్ కూడా అందుకొని దర్శకులు వీళ్లే..!!

సుకుమార్ శిష్యుల్లో ఇప్పటికీ ఒక్క సక్సెస్ కూడా అందుకొని దర్శకులు వీళ్లే..!!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ads

ఎన్నో సంచలనమైన చిత్రాలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిన టాప్ డైరెక్టర్ సుకుమార్ అంటే తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీకి క్రియేటివ్ సినిమాలు అందించిన ఏకైక డైరెక్టర్ గా గుర్తింపు సాధించారు. అలాంటి సుకుమార్ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి.

Advertisement

ఇదంతా పక్కన పెడితే సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన శిష్యులు కూడా సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు.. అందులో కొంతమంది శిష్యులు సక్సెస్ అయితే మరి కొంతమంది దారుణంగా ఫెయిల్ అయ్యారు.. ఆయన శిష్యులు ఎవరో చూద్దామా..

ఈ మధ్యకాలంలో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సుకుమార్ శిష్యుడే. ఈ సినిమా చూస్తే తెలంగాణ నేపథ్యంలో ఇదివరకు వచ్చిన సినిమాలు రంగస్థలం, ఆర్య 2 సినిమాలకు పోలికలు ఉంటాయి. అలాగే విరూపాక్ష సినిమా డైరెక్టర్ కార్తీక్ దండు కూడా సుకుమార్ శిష్యుడే. ఈయనే కాకుండా ఉప్పెన సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు, కుమారి 21ఎఫ్, 18 పేజెస్ చిత్రాల దర్శకుడు పలనాటి ప్రతాప్ కూడా సుకుమార్ శిష్యుడే. ఇలా వీరంతా సక్సెస్ అందుకున్నారు కాబట్టి వీరిని అందరూ గుర్తుపెట్టుకున్నారు.

Advertisement

Advertisement

కానీ సుకుమార్ శిష్యుల్లో ఫ్లాప్ అయిన వారు కూడా ఉన్నారు. 2012లో రానా తో నా ఇష్టం అనే చిత్రాన్ని ప్రకాష్ తోలేటి ఈయన సుకుమార్ శిష్యుడే. కానీ సక్సెస్ అందుకోలేకపోయాడు. అంతేకాకుండా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీ ని తీసిన దర్శకుడు మున్నా కూడా సుకుమార్ శిష్యుడే. సినిమా హిట్ అయింది కానీ, అంతగా గుర్తింపు సాధించలేదు. ఇక వీల్లే కాకుండా సుకుమార్ శిష్యుల్లో సక్సెస్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు.

మరికొన్ని ముఖ్య వార్తలు:

You may also like