Home » మరోసారి ఇండియాకు వ్యతిరేకంగా ఆఫ్రిది కామెంట్స్.. గట్టి పంచి ఇచ్చిన భారత క్రికెటర్..!

మరోసారి ఇండియాకు వ్యతిరేకంగా ఆఫ్రిది కామెంట్స్.. గట్టి పంచి ఇచ్చిన భారత క్రికెటర్..!

by Azhar
Ad
ఇండియా, పాకిస్థాన్ మధ్య వైరం గురించి కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ వైరం కేవలం బోర్డర్ దగ్గర మాత్రమే కాకుండా… క్రీడల్లో కూడా కొనసాగుతుంది. అది ఏ ఆట అయిన సరే ఇండియా vs పాకిస్థాన్ అని ఉంటె చాలు వ్యూస్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఇక ఈ రెండు దేశాలలో పాపులర్ అయిన క్రికెట్ లో అయితే మరీను. ఈ వైరం అభిమానుల మధ్యలోనే కాకుండా ఆటగాళ్ల మధ్యలో కూడా ఉంటుంది. ముఖ్యంగా పాకిస్థాన్ మాజీ ఆటగాడి షాహిద్ ఆఫ్రిది ఇండియాకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి అలంటి కామెంట్స్ చేసాడు.
అయితే తాజాగా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చిన కేసులో యాసిన్‌ మాలిక్‌‌ను ఢిల్లీ పటియాలాలోని ఎన్‌ఐఏ కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో అతనికి జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ విషయం పై ఆఫ్రిది తన ట్విట్టర్ లో… ఇండియాలో మానవ హక్కుల మీద గొంతెత్తుతున్న వారిని ఉగ్రవాదులుగా నేరం మోపుతున్నారని… యాసిన్ మాలిక్ అమాయకుడని… అతని శిక్షను తప్పుబడుతూ.. ఇలా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిని కోరుతున్నా అంటూ అఫ్రిది ట్వీట్ చేశాడు.
ఇక ఆఫ్రిది ట్విట్ పై భారత ప్రజలే కాకుండా భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా స్పందిస్తూ అతనికి గట్టి పంచ్ ఇచ్చాడు. మిశ్రా తన ట్విట్టర్ లో… ఆఫ్రిది యాసిన్‌ మాలిక్‌‌ కోర్టులో స్వయంగా తా నేరాన్ని ఒప్పుకున్నాడు. అందరూ నిల అబ్బదపు పుట్టిన రోజును చెప్పినట్లు అబ్బదలు చెప్పారు కదా..! అంటూ పేర్కొన్నాడు. అయితే గతంలో ఆఫ్రిది తా బర్త్ డేట్ ను తప్పుగా చెప్పి పలు క్రికెట్ టోర్నీలలో పాల్గొన్నాడు. ఆ తర్వాత నేను సరిగ్గా చెప్పిన ఐసీసీనే తన పుట్టిన రోజు తప్పుగా రాసుకుంది అని చెప్పాడు. కానీ దానిని ప్రజలు ఎవరు నమ్మలేదు.

Advertisement

Visitors Are Also Reading