Home » ‘నాకు పెళ్లి జరిగింది.. అతనే నా భర్త’ అంటూ అమీషా పటేల్ షాకింగ్ కామెంట్స్..!

‘నాకు పెళ్లి జరిగింది.. అతనే నా భర్త’ అంటూ అమీషా పటేల్ షాకింగ్ కామెంట్స్..!

by Anji

బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ పవన్ కళ్యాణ్ బద్రి, మహేష్ బాబు నాని వంటి సినిమాలతో టాలీవుడ్ లో మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఆ తరువాత అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తరువాత ఏమైందో తెలియదు.. కానీ కొద్ది కాలం పాటు ఇండస్ట్రీకి దూరం అయింది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటూ పలు ఫొటోలను షేర్ చేసి అభిమానులకు దగ్గరగా ఉంది.

ఇటీవలే మళ్లీ గదర్ 2 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది.  ఇదిలా ఉంటే.. ఈ అమ్ముడికి 48 ఏళ్ల వయస్సు ఉన్నప్పటికీ ఇప్పటికీ ఈమె పెళ్లి చేసుకోలేదు. ఐదు పదుల వయస్సులోనూ తన ఎనర్జీని చూపిస్తూ.. తగ్గెదెలా అన్నట్టు ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీషా పటేల్ తనకు పెళ్లి అయిందని సీక్రెట్ రివీల్ చేసి అందరినీ షాక్ కి గురి చేసింది. నిజజీవితంలో నాకు పెళ్లి కాకపోయినా ఓ వ్యక్తిని భర్తగా ఊహించుకుంటాను. నాకు హాలీవుడ్ టామ్ క్రూజ్ అంటే చాలా ఇష్టం, అతని కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తాను. నా మనస్సులో టామ్ ని భర్తగా అంగీకరించాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : రామ్‌ చరణ్‌ సినిమాలో చిన్న క్యారెక్టర్‌ అయినా సరే చేస్తాను.. సూర్య కామెంట్స్ వైరల్..!

Visitors Are Also Reading